• Sri Sarada Devi Vachanamrutam
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శారదాదేవి వచనామృతం

    Sri Sarada Devi Vachanamrutam

    Pages: 547
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''మీ మనస్సులను పావనం చేయగోరితే శ్రీ శారదాదేవి జీవితాన్నీ, ఆమె మహత్వాన్నీ గురించి చింతన చేస్తూవుండండి. దానికి మించిన ఉత్కృష్ట ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదు'' అని ఒక సుప్రసిద్ధ తాత్వికుడు వ్యాఖ్యానించాడు.

ఒక స్త్రీ జీవితం ఎంతటి ఉన్నతోన్నత స్థితులను చేరుకోగలదో మాతృదేవి జీవితం చెప్పక చెబుతుంది. కనుక మాతృదేవి జీవితాన్ని ప్రగాఢంగా చింతన చేయడం మనస్సును పావనం చేసే ఆధ్యాత్మిక సాధన అనడం అతిశయోక్తి కాదు. జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితులను పొందడానికి ఇది మార్గాంతరంగా భాసిస్తుంది. ఆ మార్గాంతరమే ఈ 'వచనామృతం'. మాతృదేవి తమ బిడ్డలతో చేసిన సంభాషణలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. వీరిలో స్త్రీలు, పురుషులు, గృహస్థులు, సన్న్యాసులు ఉన్నారు.

అసాధారణ కుటుంబ పరిస్థితులు, ఎనలేని బాధ్యతలు, వీటన్నికీ మించిన ఆధ్యాత్మిక మహోన్నతాలను మాతృదేవి జీవితంలో మాత్రమే మనం చూడగలం. బట్టలు ఉతికేవారు, ఇల్లు ఊడ్చేవారు, కాయగూరలు తరిగేవారు, వంట చేసేవారు, పిల్లలు భోజనం చేశాక ఆ స్థలాన్ని శుభ్రపరిచేవారు - వీటన్నింటి నడుమ మంత్రదీక్ష ప్రసాదించారు, బ్రహ్మచర్య సన్న్యాస దీక్షలు ఒసగారు. తమ సంశయాలను అడిగిన జిజ్ఞాసువులకు అద్భుత జవాబులిచ్చి, వారందరికీ ఆధ్యాత్మిక ద్వారాలను తెరచి పెట్టారు. ఈ అత్యద్భుతాలను అనేక పరిమాణాలలో ఈ గ్రంథం మనకు తెలుపుతున్నది.

- ప్రకాశకులు

గమనిక: "శ్రీ శారదాదేవి వచనామృతం" ఈ-బుక్ సైజు 11.7MB

Preview download free pdf of this Telugu book is available at Sri Sarada Devi Vachanamrutam