• Sri Sai Raksha Vratam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ సాయి రక్షా వ్రతం (free)

    Sri Sai Raksha Vratam - free

    Author:

    Publisher: Shri Designs

    Pages: 24
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అతిపవిత్రమైన షిరిడీ పుణ్యక్షేత్రంలో తనను నమ్మిన భక్తులను నిత్యం కాపాడడానికై వెలసిన సాయినాథుడు అమృతమూర్తి. సాయిని నిత్యం కొలచేవారికి ఎటువంటి ఆపదలూ కలుగవు. తలపెట్టిన అన్ని పనులలోను జయం కలుగుతుంది. జీవితం సాఫీగా, శుభప్రదంగా గడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆ సాయినాథుని నిత్యం కొలుస్తూ ఆ స్వామి అనుగ్రహంతో సుఖంగా జీవిస్తున్నారు.

ఎప్పటినుంచో సాయినాథుని భక్తులు అనేకమంది నన్ను సాయివ్రతం రచించవలసిందిగా అడుగుతున్నారు. కానీ ఆ భగవంతుని సంబంధించిన ఏ పుస్తకానికైనా ఆ దేవత కరుణ కలిగేదాకా వ్రాయటం కుదరదని నా నమ్మకం. నేను రచించిన ప్రతి పుస్తకం వెనుక ఈ విషయం ప్రత్యక్షంగా అనుభవించాను. ఇన్ని రోజులకు ఆ సాయినాథుని కృపతో ఈ పుస్తకం రచించడం జరిగింది. ఈ సాయిరక్షా వ్రతం రాసే ముందు రోజులలో ఎన్నో అద్భుతాలు గమనించాను. వరుసగా అయిదు రోజులపాటు సాయినాథుని భక్తులు ఎవరో ఒకరు రావడం, సాయినాథునిపై పుస్తకం ఎప్పుడు రచిస్తున్నారని అడగడం జరిగింది. అంతే! అటు తరువాత రెండు రోజులకే ఈ సాయిరక్షావ్రతం రచించడం జరిగింది. ఈ పుస్తకం రాస్తున్నంత సేపు ఆ సాయినాథుడే నాచే రాయిస్తున్న అనుభూతి కలిగింది. కంటికి ముందు ఈ సంఘటనలన్నీ కనపడసాగాయి. అవే ఈ విధంగా వ్రతకథల రూపంలో అక్షర రూపం దాల్చాయి. ప్రతీ అక్షరం ఆ సాయినాథుని అనుగ్రహం తప్ప మరొక్కటి కాదు. ఈ వ్రతం ఆచరించిన ప్రతీ వారికి ఆ సాయినాథుని అనుగ్రహం తప్పక కలుగుతుందని నా నమ్మకం.

- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి