• Sri Ramakrishna Charitamrutam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీరామకృష్ణ చరితామృతం

    Sri Ramakrishna Charitamrutam

    Pages: 580
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాక్షాత్తు స్వామి వివేకానంద పరిచయ ప్రశంసలు అందుకున్న ఈ పుస్తకానికి మళ్ళీ ముందుమాట వ్రాయడమంటే సాహసమే అవుతుంది. అందుకని దీనికి ‘మనవి’ అని పెట్టి ఆయన పలికిన వాక్యాల అంతరార్థం కొద్దిగా వివరించి పుస్తకాన్ని ప్రయాసకోర్చి అనువదించడం వెనుక గల సంకల్పాన్ని మీకు వివరించడమే ఈ రెండు పుటల ఉద్దేశ్యం.

శ్రీ అక్షయకుమార్ సేన్ అనే శ్రీరామకృష్ణుల పరమ భక్తుడు పద్యరూపంలో రచించిన రామకృష్ణులవారి జీవితగాథ ఈ గ్రంథం. శ్రీ శ్రీ రామకృష్ణుల పుంధిగా బెంగాలీలో ప్రచురితమైనది. రామకృష్ణులపట్ల భక్తి కుదురుకున్న భక్తులకు గ్రంథంలోని విషయం అమృతోపమానంగా ఉంటుందని తెలుగులో శ్రీరామకృష్ణుల చరితామృతం శీర్షికను ఎంచుకున్నాము. ఈ గ్రంథాన్ని వ్రాయటానికి పూనుకుని శ్రీ అక్షయకుమార్ సేన్, స్వామి వివేకానంద ముందు తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు స్వామీజీ తన అంగీకారం తెలుపటమే కాకుండా దివ్యజనని శ్రీ శారదా దేవి సన్నిధికి తోడ్కొనిపోయి అమ్మ ఆశీస్సులను కూడా ఇప్పించారు.

మొదటి భాగాన్ని వ్రాసి వివేకానంద స్వామి వారి అభిప్రాయం కోసం పంపగా స్వామీజీ ‘ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను’ అన్నారంటే ఈ పుస్తకం స్వామీజీని ఎంతగా ఆకట్టుకున్నదో మనకు అర్థమవుతుంది. ఆద్యంత రమణీయంగా జానపద బాణిలో సాగిన ఈ రామకృష్ణ చరితామృతం బెంగాల్ గ్రామీణ ప్రజల్లో బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. అక్కడక్కడ అక్షయకుమార్ సేన్ భక్త్యావేశంలో అతిశయోక్తిగా అభివర్ణించినట్లనిపించినా అందులో కించిత్ దోషంకూడాలేదని భక్తులు గ్రహించాలని మనవి.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Charitamrutam