• Sri Narada Mahapuranam
  • Ebook Hide Help
    ₹ 432
    480
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ నారద మహాపురాణం

    Sri Narada Mahapuranam

    Publisher: Victory Publishers

    Pages: 795
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ నారద మహాపురాణము అష్టాదశ మహాపురాణములలో అరవది. పురాణపురుషుడైన శ్రీమహావిష్ణువు యొక్క నాభి (బొడ్డు)గా ఈ మాహాపురాణము పరిగణింపబడుతున్నది. దీనిని కొందరు పండితులు నారదీయ పురాణంగాను, కొందరు బృహన్నారదీయ పురాణం గాను పేర్కొంటున్నారు. నారదపురాణంలో ఇరవై అయిదువేల శ్లోకాలు ఉన్నాయని, ఇది బృహత్కల వృత్తాంతాన్ని వివరించే పురాణమని, నారద ప్రోక్తమని మత్స్య పురాణం తెలుపుతున్నది. ఈ పురాణంలో ఒక్కొక్క పాదంలో వరసగా బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనాతనులనే వారు వక్తలుగా ఉన్నారు. ఉత్తర భాగం మొత్తం మాంధాత చక్రవర్తికి, వశిష్ఠుని సంవాదంగా కనిపిస్తున్నది.

నారదుడు బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులలో ఒకడు, సప్తఋషులలో ఒక మహాఋషి, అధర్వణవేదం నారదుడు దివ్యఋషి, ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణం ఆయన పర్వతునితో పాటు హరిశ్చంద్రుని గురువులలో ఒకరు అని తెలుపుతున్నాయి. ఆయన దివ్యఋషి మాత్రమేగాక నారద స్మృతి అనే గ్రంథాన్ని కూడా రచించాడని తెలుస్తున్నది.

ఇటువంటి బ్రహ్మ మానసపుత్ర, దివ్య ఋషిచేత కూర్చబడిన ఈ మహాపురాణంలో ధర్మశాస్త్ర విషయాలు, వివిధ తీర్థాలు, పుణ్యక్షేత్రాలు మాహాత్మ్యాలు, వ్రతాలు, దానవిధులు, వర్ణాశ్రమ ధర్మాలు, మంత్ర శాస్త్ర విషయాలు, పురాణపంచలక్షణాల నిరూపణం వంటి అనేక ప్రత్యేక విషయాలు ఉన్నాయి.

అంతేగాక దీనిలో అష్టాదశ పురాణ అనుక్రమణికలు సమగ్రంగా తెలియజేయబడ్డాయి. ఈ అనుక్రమణికలు చెప్పబడిన భాగం చారిత్రకంగా చాలా ప్రాముఖ్యతగల అంశం. బహుముఖీయ విజ్ఞానశాస్త్ర విషయాల చేరికతో ఇది పురాణ విజ్ఞానసర్వస్వంగా భాసిల్లుతున్నది.

మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రచురించుచున్న అష్టాదశ పురాణాలలో ఇది తొమ్మిదవ పుష్పము. మా మిగిలిన పురాణాలవలెనే దీనిని తెలుగు ప్రజలు ఇతోధికంగా ఆదరిస్తారని మా వినతి.

Preview download free pdf of this Telugu book is available at Sri Narada Mahapuranam