• Sri Maheswara Vratam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ మహేశ్వర వ్రతం (free)

    Sri Maheswara Vratam - free

    Author:

    Publisher: Shri Designs

    Pages: 24
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ పరమేశ్వరుడు కళ్యాణ స్వరూపుడు. ఆ మహేశ్వరుని ఎవరైతే నిత్యం తలుస్తుంటారో వారికి ఎటువంటి ఆపదలూ కలుగవు. సర్వ సౌభాగ్యాలూ సిద్ధిస్తాయి. పరమేశ్వరుడు భక్తజన సులభుడు. ఆ స్వామిని ఒక్కసారి తలిస్తే చాలు. ఎంతో ఆనందిస్తాడు. నిర్మల మనస్సుతో పరమేశ్వరుని ఆరాధించినవారికి అన్ని దుఃఖాలనుండి విముక్తి కలుగుతుంది. శివ భక్తులను నవగ్రహాలు బాధపెట్టవు. ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించేవారికి ఏ గ్రహ బాధలూ ఉండవు.

ఆ శ్రీనివాసుని దయవలన నేను ఇప్పటిదాకా ఆ స్వామి లీలలపై పదహారు పుస్తకాలు రచించడం జరిగింది. ఆ పుస్తకాలన్నీ దేశ విదేశాలలోని భక్తులచేత నిత్యం పఠింపబడటం ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ పుస్తకాలు చదివిన ప్రతి వారికీ ఎన్నో శుభాలు జరుగుతున్నాయి. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో వీరందరూ ఎంతో సుఖంగా జీవిస్తున్నారు. ఈ రచనలన్నిటిలో శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం, శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతకల్పం, శ్రీ ఆనంద ఆంజనేయం, భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ మూడు వ్రతాలు నిత్యం ఎందరో భక్తుల గృహాలలోను, ఎన్నో ఆలయాలలోను ఆచరింపబడుతున్నాయి.

ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ శ్రీ మహేశ్వర వ్రతం రచించగలిగాను. నేను రాసిన ప్రతీ పుస్తకం వెనుక స్వామివారి లీలలు ఎన్నో చూశాను. అలాగే ఈ మహేశ్వర వ్రతం రాస్తున్నప్పుడు కూడా ఎన్నో విశేషాలు జరిగాయి. పుస్తకం రాయడం మొదలు పెట్టగానే అనుకోకుండా శంకరమఠంలో శ్రీ చంద్రమౌళీశ్వరస్వామిని దర్శించటం జరిగింది. అటు తరువాత వరుసగా మరొక రెండు అద్భుతమైన శ్రీ పరమేశ్వర ఆలయాలను దర్శించాను. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం ఈశ్వరానుగ్రహమే. ఈ పుస్తకం రాస్తునన్ని రోజులు ఆ పరమేశ్వరుని ప్రియకుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు చిన్న బాలుని రూపంలో ఎదురుగా చిరునవ్వుతో దర్శినమివ్వడం జరిగింది. ఆ అద్భుత దృశ్యం ఇప్పటికీ నా కనులముందు మెదులుతూ ఉంటుంది. అతి సామాన్యుడనైన నాకు ఇంతటి అనుగ్రహాన్ని ప్రదర్శించిన ఆ దేవతలందరికీ నా నమస్కారములు.

- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి