• Sri Mahabharatamu Aranyaparvamu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ మహాభారతము అరణ్యపర్వము

    Sri Mahabharatamu Aranyaparvamu

    Pages: 520
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆర్షములైన శ్రీ మద్రామాయణము, శ్రీ మహాభారతము, శ్రీ మద్భాగవతము - ఇత్యాది మహాగ్రంథములతో అనుబంధమూ పరిచయమూ సన్నగిల్లటం వల్ల, ఆధునిక భారతజాతి స్థితి ఇంత దయనీయంగా ఉంది. ఈ పరిస్థితిని - దుస్థితిని - సరిదిద్ది, సనాతన భారత ధర్మమును ఆధునిక భారత జాతిలో పునఃప్రతిష్టించటానికి, వేదశాస్త్ర పురాణ ఇతిహాస మహాకావ్యముల అనువాదం ఎంతగానో దోహదం చేస్తుంది. రాగద్వేష రహితంగా, మొగమోటమికి తావు ఇవ్వకుండా నిర్భీతితో నిష్కర్షగా విశేష వ్యాఖ్యతో సాగిన మీ ఈ అనువాదం చాలా ప్రశంసనీయంగా ఉంది. మిమ్ము 'బ్రాహ్మణదాసుడు'గా మీరు పేర్కొనటం.... బ్రాహ్మణ శబ్దవాచ్యులు చాలామందిలో బ్రాహ్మణేతర మనస్తత్త్వం ప్రబలిన ప్రబలుతున్న ఈ కాలంలో, బ్రాహ్మణ ధర్మాన్ని అవమానించటమే కర్తవ్యంగా కొంతమంది భావిస్తున్న ఈ కాలంలో - మీ ఈ మాట అవగతం అవటం కష్టమే! నిజమైన బ్రాహ్మణుడు మాత్రమే తాను బ్రాహ్మణదాసుడనని ప్రకటించుకోగలడు.

- ముత్తీవి సీతారాం

* * *

భారత భాగవత రామాయణ గ్రంథాల్లోని వారు వ్యక్తులు. వాటి ఆధారంగా వచ్చిన ప్రబంధాలు, నాటకాలు, ఇతర వాఙ్మయప్రక్రియల్లో కానవచ్చే వారు పాత్రలు! ఇలాంటి నిష్కర్ష అయిన ప్రమాణం ఏర్పాటు చేసుకొని భారతకథలోని వ్యక్తుల అంతరంగాలను అన్ని కోణాలనుండి మథించి నవనీతం వంటి భావాలను వెలికితీసి పాఠకులకు విందు చేసినారు. ఆ వ్యక్తులు నలుగురే అరణ్య పర్వాంతర్గ కథాగమనానికి కీలకస్థానంలో ఉన్నవారు. ధర్మరాజు, ద్రౌపది, శ్రీకృష్ణుడు, శకుని, వీరి మనస్తత్వాలను కూలంకషంగా విశ్లేషించి తాత్పర్యతః మననం చేయదగిన చాలా మంచి అభిప్రాయాలను సెలవిచ్చినారు.

- డా. ధారా రామనాథశాస్ర్తి

* * *

ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు ఆరణ్య పర్వానుబంధం విజ్ఞాన సర్వస్వం. పాత్రల పరిచయం, ప్రాంతాలు, స్థలాలు, తీర్థాలు, క్షేత్రాలు, సూక్తులు, జాతీయాలు, సామెతలు మొదలయినవి వివరణ సహితంగా ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఆంధ్ర వచన రచనా ధురంధరులైన ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు మిగిలిన తిక్కయజ్వవిరచితాంధ్ర మహాభారత త్రయోదశ పర్వాలను అనతికాలంలోనే రచించి ప్రచురించి వ్యాప్తిలోకి తీసుకువచ్చి సనాతన హిందూధర్మాచార్యులు కాగలరని ఆకాంక్షిస్తున్నాను.

- ఆచార్య లకంసాని చక్రధరరావు

Preview download free pdf of this Telugu book is available at Sri Mahabharatamu Aranyaparvamu