• Sri Mahabharatam
  • Ebook Hide Help
    ₹ 113.40
    126
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ మహాభారతం

    Sri Mahabharatam

    Pages: 271
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ మహాభారతంలో దేవర్షుల, బ్రహ్మర్షుల, దేవతల యొక్క పరమపవిత్రమైన పనులు వర్ణించబడినాయి. ప్రతి సన్నివేశంలోనూ సనాతన పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పదనం ఉంది. సత్యం అతడే. ఋతమూ అంతడే. పవిత్రుడు, మంగళమయుడు, నశించనివాడు, కదలనివాడు, హద్దులేని జ్ఞానస్వరూపుడూ అతడే. అతడే ఈ సమస్తమునకూ మూలము. అతడి వల్లనే ఈ ప్రపంచమంతా నడుస్తున్నది. పరబ్రహ్మస్వరూపుడూ అతడే. అన్నీ అతని స్వరూపమే. అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లుగా సమస్త ప్రపంచాన్ని అతడిలోనూ, సమస్త ప్రపంచంలోనూ అతడినే చూస్తున్నారు. ఈ గ్రంథమంతా కృష్ణుడి చరిత్రతోనే నిండి ఉంది. కనుకనే ఈ మహాభారతాన్ని చదివినవాడు, సమస్త పాపాల నుండి ముక్తుడౌతాడు. సర్వశ్రేష్ఠ గ్రంథమైన ఈ మహాభారతానికి సత్యామృతాలే శరీరం. ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్థాన్ని నిశ్చయించుకోవాలి. అటువంటి ఇతిహాసపురాణ జ్ఞానంలేని వాళ్ళ వలన తనకేమైనా హాని కలుగుతుందేమోనని వేదాలు నిరంతరం భయపడుతుంటాయి. దేవతలు త్రాసులో ఒకవైపు నాలుగు వేదాలనూ, మరొకవైపు మహాభారతాన్ని పెట్టి తూచినప్పుడు మహాభారతమే గొప్పదని తేలింది. మహత్త్వం వలనను, భారవత్త్వం వలనను ఈ గ్రంథానికి మహాభారతమనే పేరు వచ్చింది.

Preview download free pdf of this Telugu book is available at Sri Mahabharatam