-
-
శ్రీ మహాగణపతి ఉపాసన
Sri Maha Ganapati Upasana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 120Language: Telugu
ఆదిపూజ్యుడు వినాయకుడు. మనం ఏ పూజ చేయాలన్నా ముందుగా విఘ్ననివారకుడైన గణపతిని పుజించాకే ఆయా దేవతల పూజని చేస్తాము. గణపతులు రకరకాల బేధాలతో ఉన్నారు. ఒక్కో గణపతి ఒక్కో రకమైన ఫలితాన్నిస్తాడు. ఈ అందరు గణపతుల్లో ప్రధానమైనవాడు శ్రీ మహాగణపతి.
శ్రీ మహాగణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో ముందుగా శ్రీ మహాగణపతి షోడశోపచార పూజావిధానాన్ని ఇచ్చాము. ఎందుకంటే శ్రీ మహాగణపతిని ఉపాసించాలనుకునేవారు శ్రీ మహాగణపతి షోడశోపచార పూజని చేసి ఆ తరువాత మంత్రజపం చేస్తే మంచిది కనుక. ఇందులో మహాగణపతి ప్రధాన మంత్రంతో పాటు శారదా తిలకం, మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధిలాంటి సుప్రసిద్ధ తంత్ర గ్రంథాలలో చెప్పిన వివిధ రకాల గణపతి మంత్రాలని పొందుపరిచాం. అలాగే శ్రీ మహాగణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తర్పణ విధానం కూడా ఈ గ్రంథంలో ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఉపాసకులకి ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
శ్రీ మహాగణపతిని ఉపాసించాలనుకునే వారు సరైన గురువు ద్వారా మంత్రోపదేశాన్ని పొంది స్వామివారిని శ్రద్ధాభక్తులతో ఉపాసించినట్లయితే శ్రీ మహాగణపతి దివ్యానుగ్రహాన్ని, ఐహికాముష్మిక ఫలాల్ని తప్పక పొందగలరు.
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి

- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹60