• Sri Linga Mahapuranamu
  • Ebook Hide Help
    ₹ 540
    600
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ లింగ మహాపురాణము

    Sri Linga Mahapuranamu

    Publisher: Victory Publishers

    Pages: 714
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అగ్ని లింగంలో ఉన్న శివుడుపదేశించిన పురాణమే లింగపురాణం. ''లైంగం తుగుల్ఫకం దక్షమ్‌'' శ్రీ మహావిష్ణువు కుడి చీలమండగ వర్ణితమైనదీ పురాణం. ''తదేకాశసాహస్రం హరమాహాత్మ్య సూచకం'' అనే వచనాన్ని బట్టి ఇందులో 11వేల శ్లోకాలున్నాయి. పూర్వార్థంలో 108, ఉత్తరార్థంలో 55 కలిపి 163 అధ్యాయాలున్నాయి. 28 విధాలైన శివావతారాలకు సంబంధించిన కథలీ పురాణంలో అగుపిస్తాయి. ఈ పురాణంలో రెండు విధాలైన శివసహస్ర నామం ఉన్నది.

యమ-నియమాదులనే అష్టాంగయోగాలతో శివారాధన విధానం, విష్ణువు చేసిన శివస్తోత్రం, మహావిష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మదేవుని పుట్టుక, లింగార్చన విధానం, మానస శివపూజ, బ్రహ్మదేవుడు రచించిన శివారాధన రీతి, యుగధర్మాలు, సప్త సముద్రాలు, సప్తద్వీపాల వర్ణన, సూర్యదేవమాహాత్మ్యం, సూర్య-చంద్ర వంశపు రాజుల వర్ణన, యయాతి చరితం, త్రిపురాసుర సంహారం, అహింసా ప్రశంస, శివదర్శన ఫలం, కైలాసవర్ణన, నర-నారీమణులకు శుభప్రదమైన ఉమామహేశ్వర వ్రతం, సదాచార నిరూపణం, వారణాశి క్షేత్రమాహాత్మ్యం, పార్వతీ కల్యాణం, వినాయక జన్మ వృత్తాంతం, షోడశ మహదాన వర్ణన - మొదలైన విషయాలు లింగపురాణంలో దర్శనమిస్తాయి.

లింగపురాణంలో శివుని ద్వారా సృష్టి ఆవిర్భావం చెందిందని, శివసంబంధమైన అనేక వ్రతాలు, తీర్థాలకు సంబంధించిన విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇందులో శైవదర్శనాలకు అనుకూలమైన పశు, పాశ అలాగే పశుపతి శబ్దాల వివేచనాత్మక వ్యాఖ్య కనిపిస్తుంది. శివతత్త్వమీమాంస అధ్యేతలకు చాలా ఉపయోగకరమైనది ఈ పురాణం. భక్తి ముక్తి దాయకమైన ఈ పురాణం శివభక్తులందరికి చేరాలని మా ఆకాంక్ష.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Sri Linga Mahapuranamu