• Sri Krishnarayamu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కృష్ణరాయము

    Sri Krishnarayamu

    Publisher: Arts and Letters

    Pages: 101
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీకృష్ణదేవరాయలు పేరు సాహితీ ప్రియంభావుకత్వానికే మారుపేరు. గత చరిత్రలోకి వెళితే భోజరాజు, శర్వనృపతుంగుడూ మున్నగువారు కూడ సాహిత్య ప్రేమలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని వారే. కాకపోతే “బోయివై నిజముగా బోయివై" అనిపించిన ఒక కవిని అందల మెక్కించడంతో సరిపుచ్చుకోక ఆ అందలం మోశాడే ఈయన, అదే సాహిత్యాభిమానానికి ముఖ్యంగా తెలుగు సాహిత్యాభిమానానికీ పరాకాష్ఠ.

కటకం నుండి కన్యాకుమారి దాకా, రాయల తరువాత గద్దెనెక్కిన ఏ చిన్నరాజో అతడు సామంతుడో, పాళెగాడో, జమీందారో ప్రతివారు అంతోయింతో సాహిత్యాన్ని పోషిస్తూ రావడం, అది ఆయన వేసిన బాటయేననేది సుస్పష్టం. అందులో తెలుగు సాహిత్యానికి కాస్త పెద్ద పీట లభించడం ఆయన పుణ్యమే.

నిన్నమొన్నటిదాకా భాషావారు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడ ఇంచుమించు దక్షిణ భారతంలో ఎక్కడికెళ్ళినా తెలుగు మాటకు మన్నన, సాత్వికమైన మర్యాదా అమితంగా ఉండేది. అది ఆయన పెట్టిన భిక్షయే.

ముఖ్యంగా అంతపెద్ద సామ్రాజ్యానికి ప్రభువైవుండి ఆయన వర్తన ఇంచుమించు నభూతో నభవిష్యతి. ఇటు వ్యవసాయాన్నీ, అటు పరిశ్రమల్నీ, వ్యాపారాన్నీ, సాంస్కృతిక రంగాన్నీ నడిపించిన తీరులో ఆయన కచ్చితంగా అద్వితీయుడే.

అలాంటి రాయల్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవటం, స్ఫూర్తి పొందటం ఎప్పటికైనా సరే ఒక చారిత్రిక అవసరం. ఆ పనిని మా ఆర్ట్స్ & లెటర్స్ ద్వారా చేయగలందులకు సంతోషిస్తున్నాను.

- చెన్నూరు ఆంజనేయరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Sri Krishnarayamu