• Sri Krishna Devaraja Vijayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కృష్ణ దేవరాయ విజయం

    Sri Krishna Devaraja Vijayam

    Author:

    Pages: 49
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ కృష్ణ దేవరాయ విజయం

చారిత్రక నాటకము

బుక్కరాయలు : (ఆశ్చర్యంతో) ఇది యేమి చిత్రం స్వామీ! వేటకుక్కలను కుందేళ్ళు వేటాడటమా? కుందేళ్ళకు దడిసి వేటకుక్కలు పారిపోవడమా?

విద్యారణ్య : (ఒక్క క్షణం కళ్ళు మూసుకుని) ఇది ఈ స్థల మహత్యం. ఈ గడ్డపై పుట్టిన కుందేళ్ళు కూడ వేట కుక్కలను వేటాడగలవు. ఇది రామాయణ కాలం నాడు ఈ స్థలానికి లభించిన శ్రీరామరక్ష.

(ఆనంద, ఆశ్చర్య, సంభ్రమాలతో విద్యారణ్య స్వామికి నమస్కరిస్తూ, నిలబడి ఉన్న హరిహర, బుక్క రాయలను దీవిస్తూ విద్యారణ్య స్వామి లేచి నిలబడి)

విద్యారణ్య : మీకు విద్యానగర రాజ్య స్థాపనకు స్థలం నిర్ణయమైంది. ఇక సంకల్ప సిద్ధిని పెంపొందించుకొని రాజ్య స్థాపనకు సిద్ధం కండి.

హరిహర : (చేతులు జోడించి) రాజ్యస్థాపన అంత తేలికా స్వామీ! కట్టు బట్టలు, వెంట ఒక ఖడ్గము తప్ప మా వద్ద ఏమున్నవి? కోట కట్టడానికి గజ, తురంగ, పదాది దళాలను సమకూర్చుకునేందుకు, ఆయుధ సామగ్రిని పెంపొందించుకునేందుకు ఎంత ధనం కావాలి? చేత చిల్లిగవ్వ లేనివాళ్ళమే.

విద్యారణ్య : సంకల్పమే సర్వ శక్తి సంపదలను సమకూరుస్తుంది. సంకల్పమే సకల నిధి నిక్షేపాలు. మీరు ఇక్కడే వుండండి. కొద్ది సమయంలో మీకు శంఖారావం వినిపిస్తుంది. ఆ శంఖారావం వినిపించగానే ఇక్కడ శంకుస్థాపన చెయ్యండి. (అంటూ విద్యారణ్య స్వామి వెళ్ళిపోయాడు) (అదృశ్యమయ్యాడు).

Preview download free pdf of this Telugu book is available at Sri Krishna Devaraja Vijayam