• Sri Kapinjala Samhita
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 378
    420
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కపింజల సంహిత

    Sri Kapinjala Samhita

    Pages: 308
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది చాలా ప్రాచీనమైన సంహిత. భద్రాచలం, సింహాచలం, శ్రీకూర్మం వంటి వైష్ణవ దివ్యక్షేత్రాలలో నేటికీ అనుసంధింప బడుతున్నది ఈ సంహిత. కొందరు స్వాములు తామాచరిస్తున్న భగవత్కైంకర్యాలను శ్రీ పాద్మ విష్ణు కపింజలోక్త ప్రకారేణ అంటూ నేటికీ ఆచరిస్తున్న పరమప్రమాణ సంహిత ఇది.

దీనిలో పాంచరాత్రాగమ సంహితలలో సాధారణంగా కనిపించే కర్షణాది (భూమి దున్ని చదును చేయుట మొదలుకొని) ప్రతిష్టాంతకార్యక్రమాలే కాక వైష్ణవుడెట్లుండాలి, వైష్ణవదీక్షను ఏ విధంగా స్వీకరించాలి? అనే విషయాలతో పాటు భగవత్ ప్రతిష్ఠ తరువాత చేయవలసిన మహోత్సవవిధిని (దీనినే నేడు బ్రహ్మోత్సవమని అంటున్నాం) విపులంగా తెలుపుతున్నది. అట్లే అర్చకుడు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు చేయవలసిన స్వాపవిధిని, పూరణము, పత్రచ్ఛేదమనే పేరుతో పత్రాలు సమర్పింపవలసిన విశేషవిధులను తెల్పుతున్నది. ఇవికాక, ఆలయం కాని, భగవంతుని మూర్తులు కాని జీర్ణమైతే, నూతనమైన వాటిని చేయించేటప్పుడు తీసికోవలసిన జాగ్రత్తలనూ తెలిపింది. ఇట్టి విషయాలు దీనిలో అనేకం.

ఇంకా, వీటిని సంస్కృతభాషయందు అంతగా అవగాహన లేని స్వాములకు తెల్పుటకు తెలుగు తాత్పర్యంతో అందిస్తూ, వారికి అనుకూలంగా ఉండుటకు ముద్రలను సచిత్రంగా చూపించడమే కాక, మూడు కలశాలు మొదలుకొని త్రిసప్తత్యుత్తర చతుఃశత (473) కలశాలు ఉంచే పద్ధతి, స్వస్తికాది మండలాలు, కఠినమైన కొన్ని పదాల అర్థాలు, కపింజల సంహిత తెల్పుతున్న విషయాలనూ సంక్షిప్తంగా ప్రత్యేకంగా ఆయా అనుబంధాలలో చూపించడం జరిగింది.

తెలుగు తాత్పర్యంతో, అనేక విశేషాంశాలతో ఉన్న ఈ గ్రంథం, అర్చకులు మాత్రమే కాక జిజ్ఞాసువులందరి దగ్గర ఉండవలసిన గ్రంథం.

Preview download free pdf of this Telugu book is available at Sri Kapinjala Samhita