• Sri Hanumadvratamu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ హనుమద్వ్రతము

    Sri Hanumadvratamu

    Publisher: Mohan Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మర్కటేశ మహోత్సాహ దుష్టగ్రహనివారణ |
శత్రూస్సంహర మాం రక్షశ్రియం దాపయ మే ప్రభో||
దేహబుద్ధ్యాస్మిదాసో౽ హం జీవబుద్ధ్యాత్వదంశకః
ఆత్మబుద్ర్యూత్వమేవాహం ఇతిమే నిశ్చితామతిః


ఒకపరి ఆంజనేయుడు శ్రీరామునిజేరి యోగమును అద్వైత జ్ఞానమును ఉపదేశింపుమని కోరెను. శ్రీరాముడు అష్టాంగ యోగమును జ్ఞానమును అనుభూతిని చెప్పెను. దానికి ఆంజనేయుడు వినుతిజేయుచు చెప్పిన మాటలే పై శ్లోకార్థము.

స్వామీ! నేను దేహమే నేను అనెడి బుద్ధితో నీకు దాసుడను నేను దేహముకంటె వేణుగానున్న జీవుడ అనెడి బుద్ధితో నున్నప్పుడు, నీవు పరమాత్మవు నేను, నీ అంశము =అవయము ఐనవాడను. నేను జీవుడను కాను, మెలకువ స్వప్నము, నిద్రావస్థలకు అతీతముగా సర్వ సాక్షియైనవాడనెడి అనుభూతి యందు నీవే, నేను, నేనే, నీవు బేధంలేదు అనెడి నిశ్చితమైనబుద్ది కల్గినదని చెప్పినాడు. దీనిని బట్టి ఆంజనేయుడు సగుణుడగాను, నిర్గుణుడునుగాను చెప్పబడినట్లైనది. కోరికలు సిద్ధించుటకు సగుణరూపములోనున్న హనుమంతుని అర్చన చేయాలి. నిష్కామమైన మోక్షము కోరువాడు నిర్గుణుని సర్వచైతన్యమునుగా భావించాలి అని గుర్తింపవలెను. ఈ హనుమద్ర్వతాన్ని ప్రతపరులను ఆంజనేయుడు సకలాయురారోగ్యభాగ్యాలను ఇచ్చి కాపాడు గాక.

- నోరి భోగీశ్వర శర్మ

Preview download free pdf of this Telugu book is available at Sri Hanumadvratamu