-
-
శ్రీ గురు రాఘవేంద్ర చరితం
Sri Guru Raghavendra Charitam
Author: Vidyadhar Munipalle
Publisher: Self Published on Kinige
Pages: 54Language: Telugu
శ్రీ గురు రాఘవేంద్ర చరితం పద్య నాటకం
రచన: విద్యాధర్ మునిపల్లె
మనిషిని మనిషిగా కాక కులం, కట్టుబాట్లతో దూరంగా ఉంచుతున్న రోజులు నేటికీ ఉన్నాయనేది వాస్తవం. కులం కట్టుబాటుతనాలు మనిషి ఎదుగుదలకు గొడ్డలిపెట్టువంటివంటూ వ్యతిరేకించిన మహానుభావులు చరిత్రలో తమదైన శైలిలో ఘోషించారు. వారు నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపించి ఆరాధ్యులయ్యారు.
కానీ నేటికీ కుల, మతాల పేరుతో జరుగుతున్న దమనకాండలు ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోటన్నా మనం మీడియాల ద్వారా గమనిస్తునే వున్నాం. ఇలాంటి రోజుల్లో ఇటువంటి మహనీయులను మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. 15-16 శతాబ్దాల మధ్య కాలంలో కులవ్యవస్థను నిరసిస్తూ తమదైన శైలిలో భక్తిమార్గాన్ని ఎంచుకుని తన బోధనల ద్వారా జగత్తుని జాగృతం చేసిన దివ్యగురువు శ్రీ గురు రాఘవేంద్రుడు. అతని జీవిత విశేషాలే ఈ పద్య నాటకం "శ్రీ గురు రాఘవేంద్ర చరితం".
సమర్థులైన వారు అరుదుగా జన్మిస్తారు. అటువంటి సమర్థుడు సమర్థునిగా కాక అసమర్థునిగా మౌనం వహిస్తే చరిత్రలో ఊహించని పెద్ద తప్పులే జరిగివుండేవి. అలాంటి తప్పులు జరగనీకుండా వెన్నంటి సరైన మార్గంలో నడిపించేవాడే సద్గురువు.
- విద్యాధర్ మునిపల్లె
