• Sri Garuda Puranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ గరుడ పురాణం

    Sri Garuda Puranam

    Pages: 136
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో పదిహేడవది గరుడ పురాణం. "మజ్జాతు గారుడం ప్రోక్తం" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీ మహా విష్ణువు శరీరంలోని క్రొవ్వుగా వర్ణించబడింది. గరుడ కల్పంలో శీ మహావిష్ణువు గరుత్మంతుడికి బోధించిన పురాణమే ఈ గరుడ పురాణం. ఇది పూర్వఖండం, ఉత్తర ఖండం అనే రెండు ఖండాలుగా విభజించబడింది. దీనిలో 264 అధ్యాయాలున్నాయి.

గరుడ పురాణం అనగానే ఇది కేవలం పాపపుణ్యాలు, నరకాలు, యమబాధలు, ప్రేతకర్మలు, ప్రేతలోకాలు.. వీటిని గురించి చెప్పే పురాణమే అన్న భావన లోకంలో వుండిపోయింది. అయితే ఇవన్నీ ఉత్తర ఖండంలో చెప్పబడ్డ విషయాలు. పూర్వఖండంలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు, ఆయుర్వేద, జ్యోతిష, మంత్ర తంత్ర సంబంధ విశేషాలు చాలా వివరంగా వర్ణించబడ్డాయి.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Garuda Puranam