• Sri Brahmanda Mahapuranam
  • Ebook Hide Help
    ₹ 432
    480
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ బ్రహ్మాండ మహాపురాణం

    Sri Brahmanda Mahapuranam

    Publisher: Victory Publishers

    Pages: 764
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

“బ్రహ్మాండ చరితోక్తత్వాత్ బ్రహ్మాండం పరికీర్తితమ్” – అని బ్రహ్మాండమునందలి భౌగోళిక వర్ణన చేయుటచేత బ్రహ్మాండ పురాణంగా ప్రసిద్ధికెక్కినది ఈ పురాణము. ఇది అష్టాదశపురాణకర్త వేదవ్యాసమహర్షి కృతము. అష్టాదశపురాణ గణనంలో ఇది పద్దెనిమిదవ పురాణము. ఇది పూర్వ, మధ్యమ, ఉత్తరభాగాలనే మూడు భాగాల చేత లేక ప్రక్రియ. అనుషంగ, ఉపోద్ఘాత, ఉపసంహార పాదాలనే నాలుగు పాదాలుగా విభజించబడి ఉన్నది మొత్తం 216 అధ్యాయాలు ఈ పురాణంలో ఉన్నాయి.

ఇందులో నైమిషీయోపాఖ్యానము, హిరణ్యగర్భ ప్రాదుర్భావము, దేవఋషిసృష్టి, కల్ప, మన్వంతర యుగాది పరిమాణము, రుద్రసర్గ, ఋషిసర్గ, అగ్నిసర్గము, దక్షశంకరుల పరస్పర శాపవృత్తాంతము, భువనకోశము, గంగావతరణము, ఖగోళవర్ణనము, సూర్యాదిగ్రహ, నక్షత్ర గోళములు విస్తృత వివేచనము, వేదశాఖా విభాగము, వివిధ మంత్రముల భేదము, మన్వంతరోపాఖ్యాన వివేచనము, పరశురామ చరిత్రము నగర మహారాజవంశ వృత్తాంతము, సూర్యచంద్ర వంశరాజుల వృత్తాంతాలు, రాజరాజేశ్వరి త్రిపురసుందరీ మాతా మహాత్మ్యపూర్ణ ఉపాఖ్యానము. రాక్షసుల వినాశనమునకై లలితాదేవి సపరివారధారణము, ఖండాసుర వృత్తాంతము, కామదహనము, వివిధ మంత్ర, తంత్ర, యంత్ర, రూపమున ముద్రలతో లలితాదేవి అర్చనము. మొదలగు వృత్తాంతముల సమగ్ర వివరణ కలదు.

ఈ పురాణము హయగ్రీవ – అగస్త్యుల సంవాదముగా నైమిశారణ్యమున సూతునిచే శౌనకాది మహామునులకు ఉపదేశింపబడినది. ప్రత్యేక విషయము ఏమనగా ఈ పురాణము క్రీ.శ. ఒకటి రెండు శతాబ్దములలోనే జావా(బాలి) ద్వీపమునకు పండితులచే తీసుకొనిపోబడి అక్కడ ఆ దేశపు ‘కవి’ భాషలోనికి సంగ్రహముగ అనువదింపబడినది నేటికి కవి భాషలో బ్రహ్మాండ పురాణము లభ్యమగుచున్నది. ఈ పురాణమందు పురాణ పంచ లక్షణములు నిరూపణము చక్కగా వేయబడినది. అతి ప్రాచీన పురాణములలో బ్రహ్మాండ పురాణము ఒకటి. ప్రాచీన ఆంధ్ర వంశరాజులు, ఇంకా ఇతర వంశ రాజుల వంశ వివరణము వంటి చారిత్రిక విషయములు ఇందు కలవు.

మేము గత నాలుగు సంవత్సరములుగా ప్రచురించుచున్న అష్టాదశ పురాణాలలో ఇది పదవ పుష్పము. మా మిగిలిన పురాణాలవలె దీనిని తెలుగు ప్రజలు ఇతోధికంగా ఆదరించ గలరని మా వినతి.

Preview download free pdf of this Telugu book is available at Sri Brahmanda Mahapuranam
Comment(s) ...

Brahmanda purana book is very good. I am disappointed for only one reason that there are many stotra part of this puranam and none of them are given which the readers could chant. I know may stotras are described with meaning but the stotra lyrics is missing.This book would have been completed with some important stotra and mudras.