• Sri Brahma Vaivarta Mahapuranam
  • Ebook Hide Help
    ₹ 540
    600
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం

    Sri Brahma Vaivarta Mahapuranam

    Publisher: Victory Publishers

    Pages: 1084
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అష్టాదశ మహాపురాణ గణనలో శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం పదవ పురాణం. మరికొందరిని అనుసరించి ఇది పన్నెండవ పురాణం. ఈ మహాపురాణంలో రధంతర కల్పవృత్తాంత విశేషాలు, నారద మహర్షి ప్రార్ధనను అనుసరించి సావర్ణి చేత చెప్పబడినవని నారద, మత్స్య పురాణాల ద్వారా తెలుస్తున్నది. 'వివర్తనాత్ బ్రహ్మణస్తు బ్రహ్మవైవర్తముచ్యతే' (అనగా బ్రహ్మ యొక్క వివర్త ప్రసంగ కారణము చేత బ్రహ్మ వైవర్త పురాణము అని చెప్పబడుతున్నది). వివర్తమనగా అసలు స్వరూపము. రూపు ఉండగానే వేరు రూపంలో కనిపించడం, పరమబ్రహ్మయైన భగవంతుడు శ్రీ కృష్ణుడుగాను, ప్రకృతియైన మహామత రాధికగాను కనిపించుటయే వివర్తము. శ్రీకృష్ణుడు తన పూర్ణమైన బ్రహ్మస్వరుపమును, వికృతం అనగా స్పష్టపరుచుచు లేక కృష్ణుని బ్రహ్మత్వము యొక్క సంపూర్ణమైన వివర్తము లేక పరిణామము దేనియందు వర్ణింపబడినదో దానికి పురాణవేత్తలు బ్రహ్మవైవర్తము అని పేరు ఇచ్చిరి. దాక్షిణాత్యులలో ఈ పురాణానికి బ్రహ్మకైవర్తము అనే పేరు ప్రచారంలో ఉన్నది. ఈ పురాణంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం బ్రహ్మ, ప్రకృతి, గణేశ, శ్రీకృష్ణ ఖండాలనే నాలుగు ఖండాలుగా ఉన్నది. నాల్గవది అయిన శ్రీకృష్ణ ఖండము పూర్వ, ఉత్తర ఖండాలనే రెండు భాగాలుగా ఉన్నది.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ఒక జ్ఞాన భాండాగారం. దీనిలో ప్రతిపాద్య విషయము గోలోకవాసుడైన శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఆహ్లాదినియైన శక్తి రాధికలు ఎల్లప్పుడు గోలోకంలో గోవులు, గోపికలతో కూడి రాసక్రీడా ప్రియులుగా ఉండి భక్తజనులకు అలౌకిక ఆనందాన్ని సమకూర్చుతుంటారని తెలుపబడింది. అందువలన ఈ మహాపురాణం వైష్ణవులకు ముఖ్యంగా రాధాకృష్ణ భక్తులకు పరమ ప్రామాణిక గ్రంథంగా చెప్పబడుతున్నది.

ఇప్పటివరకు పురాణ భారతి క్రమంలో పదకొండు మహాపురాణాల వచనానుసరణములు వెలువడ్డాయి. వానిని తెలుగువారు విశేషంగా ఆదరించారు. ఆ క్రమంలో ఇది పన్నెండవది. దీనిని శ్రీ కృష్ణ భక్తులు, ఆస్తికులు, తెలుగు గ్రంథ పాఠకులు విశేషంగా ఆదరించి సంపూర్ణ అష్టాదశ మహాపురాణ ప్రచురణలో తమ చేయూత నివ్వగలరని ఆశంస.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Sri Brahma Vaivarta Mahapuranam