• Sree Krishna Leelalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీకృష్ణ లీలలు

    Sree Krishna Leelalu

    Publisher: Desineni Anjaneyulu

    Pages: 84
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
Desineni

రచన: కీ. శే. దేశినేని వేంకట్రామయ్య




శ్రీ కృష్ణుని గీతోపదేశం కంటె శ్రీకృష్ణుని లీలలే పామర జనానికిష్టమౌతాయి. శ్రీకృష్ణలీలలు అనగానే తెలుగు భాగవతం గుర్తుకొస్తుంది. పోతనామాత్యుడు గుర్తుకువస్తాడు. దశమస్కందంలో పోతన వర్ణించిన శ్రీకృష్ణలీలలు తెలుగు మాతృభాషగా గల్గిన ప్రతి వ్యక్తి తప్పక చదవాల్సిందే.

కీ.శే. దేశినేని వేంకట్రామయ్యగారు ఇట్టి భాగవతాన్ని హృదయస్థానంలో నిలుపుకొని శ్రీకృష్ణలీలలను దర్శించినాడని నా భావన. వ్రేపల్లెలో తిరుగుతున్న కన్నయ్య అందచందాలను దేశినేని మనోజ్ఞంగా వర్ణించి సాక్షాత్తు ఆ చిన్ని కన్నయ్యను మనముందు నిలిపాడు.


సీ. అరవిందములఁ బోలు నడుగుదమ్ముల యందు
గజ్జలందెలు ప్రీతి గడలఁ గట్టి
కటిభాగమున పైడి ఘంటికల్ సవరించి
బాహుదండల బాజి బందులుంచి
పులిగోరు రత్నాలు పొదిగిన దండలు
అరుత భాగంబున నమరవెట్టి
నెమ్మి యీకనొకండు సమ్మోద మెసలార
తలమానికంబుగా నెలమిఁ గూర్చి

తే. తళుకు బెళుకుల నీలంపు తనువెసంగ
కడిమి రాకా నిశాకరు కళల మీరు
మంద హాసాస్యుడై తమముందు మిగుల
చిందులాడంగ యానందమందు చుంద్రు

చిత్రమేమిటంటే ఇందులో కేవలం శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, లీలలేకాక, వాసుదేవుడు రాయబారిగా పాండవుల పక్షాన కౌరవసభకు పోవడం, యుద్ధభూమిలో కిరీటికి కర్తవ్యోపదేశం చేయడం, పాండవ విజయాన్ని కళ్ళారా చూడడం, తిరిగి ద్వారకకు చేరడం, నిర్యాణం చెందడం మొదలైన ఘట్టాలు చకచకా సాగాయి. ఔచిత్యాన్ని పాటించి, కథాగమనాన్ని పెంచి, సరసంగా, సుశబ్ధశోభితంగా శ్రీకృష్ణుని చరిత్రను సంపూర్ణంగా ఆవిష్కరించిన తీరు అద్భుతం. పరమాద్భుతం!

- ఆచార్య మసన చెన్నప్ప

అదియునుగాక ఈ గ్రంథమునకు ఎంచుకొన్న ముఖచిత్రం నవనీత గోపాలకృష్ణస్వామి విగ్రహము స్వయంవ్యక్తమైనను, వైఖానసాగమ, ‘శ్రీశాస్త్ర’ ప్రకారము సరిపోలియున్నది. బాలకృష్ణస్వామి అర్చామూర్తి, దిగంబరమూర్తిగా భారతదేశంలోనే అతిపెద్ద, అపురూపమనోహర శిల్పరాజము. పర్యంకాసనముపైనుండి కుడిహస్తములో ‘వెన్నముద్ద’ ఎడమచేతి క్రింద ‘వెన్నచట్టి’ కల్గి దోగాడుచున్న భంగిమలో స్వామి మనకు దర్శనమిచ్చును. ఆ స్వామి తల నీలాల అందం, మెడలోని పులిగోరు చందం చూసితీరాలి.


సీ. శ్రీనివాసంబైన సీమయై యొప్పారు
గుంటూరు జిల్లాను గుర్తు జేయ
కృష్ణరాయల శౌర్యకీర్తి పతాకాల
విజయ ధ్వజంబది వేడ్క గొలుప
విజయనగర వాస్తు విన్యాస రీతికి
కలికితురాయియై కనులదోచ,
నవనీత బాలకృష్ణస్వామి యందాల
రూపురేఖలు మది ప్రోవు పడగ

ఆ.వె. ‘కొండవీడు’ దాపు ‘కోట’ గ్రామంబున
కొలువు దీరి నట్టి గోపబాల
మూర్తిఁ గనగ జన్మమూల సాయుజ్యమున్
సిరులు, విరివిఁ గొనఁ దరలిరండు!

ఈ మూర్తిని దర్శించిన వ్యక్తి, పారవశ్యముతో కవిత రచించిన వ్యక్తి, ‘కనకశ్రీ’ దేశినేని కోదండరామారావు.

Preview download free pdf of this Telugu book is available at Sree Krishna Leelalu