• Sree Desineni Kandala Mandaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ దేశినేని కందాల మందారము

    Sree Desineni Kandala Mandaram

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
Desineni

రచన: కీ. శే. దేశినేని వేంకట్రామయ్య





శ్రీ దేశినేని కందాల మందారము 506 కంద పద్యముల సంపుటి.
ఈ గ్రంథ రచన ఆరంభమున కవిగారి వర్ణన వారి ఆలోచనా సరళికి అద్దము పట్టు భావన క్రింది పద్యముల ద్వారా విదితమగుచున్నది. పాఠకుని సఖుడా అని సంబోధిస్తూ తాను రచించిన సూక్తులను నిస్సందేహంగా చదువమని కోరుట కవిగారి ఆత్మ పరిణతికి ఆనవాలు.


కం. మందారము నామంబున
గందంబులు సుధలు జిందగల చందమునన్‌
బృందావన మన వ్రాసితి
సందేహము మాని దీనిఁ జదువుమి సఖుడా! ... (2)

కం. తొలి జన్మము, మలి జన్మము
ఫలితంబుల కలిమి, బలిమి పదిమందికి మేల్‌
దొలకరిఁ గావలెననియెడి
తలపులు గిలిగింత పెట్టఁ దవిలి నుడివితిన్‌ ... (3)

మానవునికి తొలి జన్మము, మలి జన్మమున్నట్లు తెలుపుట కవిగారి మనఃస్థితిని ధృవీకరించుచున్నది. తనకు పూర్వజన్మవాసనా అనుభవములున్నట్లు తను వ్రాసుకున్న స్వీయచరితలో తెలుపుట విశేషము. ఆ స్వీయానుభవములను ప్రజాబాహుళ్యమునకు తెలుపు తలపు అభినందనీయము. ఈ గ్రంథము పూరించునాటికి కవిగారి ఆరోగ్యము కొంత ఆందోళనకరముగావున్నను తన చిత్తశుద్ధికి ఆనవాలుగా ఫలశ్రుతి, ముగింపు వాక్యములను కూర్చి కావ్యమర్యాదలను పాటించిరి.

- ప్రకాశకులు
దేశినేని ఆంజనేయులు

Preview download free pdf of this Telugu book is available at Sree Desineni Kandala Mandaram