• Sphurti Kathalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్ఫూర్తి కథలు

    Sphurti Kathalu

    Publisher: S.R. Book Links

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తిలక్ నిబ్బరం

లోకమాన్య బాలగంగాధర తిలక్ గొప్ప ధైర్యశాలి. గాంధీజీలాంటి పెద్దలకు ఆదర్శప్రాయుడు. తిలక్ నిబ్బరం గురించి ఎన్నో ఉదంతాలు చెప్పుకుంటారు. మచ్చుకు ఒకటి తెలుసుకుందాం.

కొంత కాలం తిలక్ జైల్లో ఉండేవాడు. ఆ కాలాన్ని వృథా కానీయక రచనలు చేసేవాడు. ఒకరోజు తిలక్ మంచి ఏకాగ్రతతో రాసుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే జైలర్ వచ్చి టెలిగ్రామ్ ఇచ్చాడు. దానిని తిలక్ చదివేసి తన జేబులో పెట్టుకున్నాడు.

తిరిగి రాయడంలో లీనమయ్యాడు. అది చూచి జైలర్ చకితుడయ్యారు. పిదప, "మీరు ఆ టెలిగ్రాం చదివారా ? మీ భార్య మరణించిన వార్త మీకు దుఃఖాన్ని కలిగించలేదా ?" అన్నాడు.

తిలక్ రాయడం మాని, "నా దేశం కోసం నేను ఎంతో కన్నీరు కార్చాను. ఇక నాకంట్లో నీరు లేదు. ఒకవేళ నేను చేస్తున్న పనిని పక్కన పెట్టేసి నా భార్యకోసం ఏడుసూ కూర్చుంటే ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది. నా భార్య సాంగత్యంలో నేను కాలం వృధాచేయకూడదనే నేర్చుకున్నాను" అన్నాడు మామూలుగా. తిలక్ మాటలు విన్న ఆ జైలర్ మరింత ఆశ్చర్యంతో, అభిమానంతో తలవంచి నిలబడిపోయాడు.

తిలక్, అంతటి ఆత్మనిబ్బరం గల మహానుభావుడు మరి.

గమనిక: " స్ఫూర్తి కథలు " ఈబుక్ సైజు 9.2mb

Preview download free pdf of this Telugu book is available at Sphurti Kathalu