• Software ItiHasyam
  • Ebook Hide Help
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం

    Software ItiHasyam

    Pages: 81
    Language: Telugu
    Rating
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    '3.80/5' From 10 votes.
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 6 premium votes.
Description

అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న“రామ్@శృతి.కామ్” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”.

* * *

మానేజరు గొడవతో మనస్సు బాగోక, అనుకున్నట్టుగానే అద్దంకి పయనం అయ్యాడు. తాను అరగంట ముందుగా వస్తే తన బస్సు రావాల్సిన సమయానికన్నా గంట ఆలస్యం అని చెప్పటంతో, చేసేది ఏమి లేక, వచ్చి పోయే బస్సులను లెక్కేస్తూ నిలబడ్డాడు. “బస్ స్టాప్ లోనే ఉన్నా డాడీ! బస్సు గంట ఆలస్యం అట, అది వచ్చాక చేస్తాను” అని ఫోనులో మాట్లాడుతున్న ఒక అందమైన అమ్మాయి అజయ్ కంట పడింది. ఆసక్తిగా అజయ్ ఒక చెవి అటు వైపు వేసాడు. “ఏ విషయం మెయిల్ చేస్తామని చెప్పాడు. నేనైతే బాగానే చేశాను” అని వినపడింది. ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నదన్న విషయం అర్థమైంది అజయ్ కి. “ఉద్యోగం వచ్చేదాకా, అది రాలేదన్న బాధ మాత్రమే ఉంటుంది. వచ్చాక అస్సలు బాధలు మొదలవుతాయి” అని మనసులో అనుకున్నాడు అజయ్.

ఆ అమ్మాయిని పైనుండి కింద దాక తన కళ్ళతో స్కాన్ చేయటం మొదలు పెట్టాడు. “ఇప్పుడే షోరూమ్ నుండి వచ్చిన వోల్వో బస్సులాగుంది” అనుకున్నాడు. పోలిక బాగోలేకపోయినా అమ్మాయి బాగుందన్న విషయం అర్థం అవ్వాలి. అజయ్ తనని చూడటం ఆ అమ్మాయి కూడా గమనించింది, అజయ్ ని తిరిగి చూడటం మొదలు పెట్టింది . “టైం బాగలేనప్పుడు కూడా మన టైమింగ్ బాగానే ఉన్నదే” అని మనసులో అనుకున్నాడు. కాసేపటికి ఆ అమ్మాయి అజయ్ దగ్గరకి వచ్చి “మీరు అజయ్ కదా! నా పేరు లావణ్య గుర్తుపట్టారా?” అన్నది. ఆశ్చర్యంతో “ఇందాకటి నుండి అదే చూస్తున్నా ఎక్కడో చూసినట్టున్నది, గుర్తుకు రావటం లేదు” అన్నాడు. “మీరు R N E C కాలేజీలో మాకు సీనియర్ సార్. మాకు మీరు క్యాంపస్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు” అన్నది, అజయ్ ఆశ్చర్యానికి తెర దించుతూ.

“అదీ సంగతి! మనదగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక ఇంక ఉద్యోగం ఏమొస్తుంది?” అని మనస్సులో అనుకొని, “ఓ నైస్, ఏమి చేస్తున్నావు ఇప్పుడు?” అని అడిగాడు. “ క్యాంపస్ లో జాబ్ రాలేదు మీకు లాగా, అందుకని జాబ్ ట్రై చేస్తున్నా?” అన్నది.

Preview download free pdf of this Telugu book is available at Software ItiHasyam
Comment(s) ...

Awesome narration, full of comedy

Pls enable rent option for this book.

When can we get the Print book of this novel?

My honest feedback is, I felt very bored, just skim through this book in 15 minutes. Why so much bias towards software people? I agree that villages are good for peaceful living, but times have changed. I know many many people who are passionate about software and happy in their lives. Having BP, Sugar nothing to do with software industry. Our previous generation and our parents also have BP, Sugar issues even though they never worked in software. I think whoever not interested in software job can quit their job instead of polluting company's culture which impacts others. Not worth it!

Please provide print book.