• Sodara Sodareemanulara
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • సోదర సోదరీమణులారా...

    Sodara Sodareemanulara

    Pages: 787
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశ యువతరానికి బహుశ వివేకానంద స్వామి కంటె ఉన్నతమైన నేత లభించడేమో! వివేకానంద స్వామికి నివాళులర్పిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ ఇలా అన్నారు: “నేటి యువతరంలో ఎందరు వివేకానంద స్వామి ప్రసంగాలు, రచనలు చదివి ఉంటారో నేనెరుగను. కాని ఒక్కటి మాత్రం చెప్పదలచుకొన్నాను. మా తరంలో అనేకులకు ఆయన ప్రగాఢ స్ఫూర్తినిచ్చారు: ప్రస్తుత తరానికి స్వామీజీ రచనలను చదవడం ఎంతో మేలొనగూరుస్తుందని నేను భావిస్తున్నాను, వాటినుంచి వారెంతో గ్రహించగలరు...”

వివేకానంద స్వామి రచనలు యావత్తు పది సంపుటాల్లో “లేవండి, మేల్కొనండి!” పేరిట దాదాపు 5000 పుటల్లో మేం ప్రచురించాం. అనేకులకు అవి అందుబాటులో లేకపోవడమో, చదవడానికి తీరిక, వ్యవధి ఉండకపోవటమో జరుగుతూంటుంది. ఆ కారణంగా వివేకానంద స్వామి రచనల సంకలనం ఒకటి ఆవశ్యకమైంది. ప్రస్తుత ఈ గ్రంథం ఆ కొరతను తీర్చగలదని, తీరుస్తుందని మేం ఆకాంక్షిస్తున్నాం.

స్వామీజీ ముఖతః లేక కలంగుండా వెలువడ్డ రచనలకు అత్యంత ప్రత్యేకత ఉంది కనుక- కేటాయించబడ్డ ఈ గ్రంథపరిథిలో వేటిని ఎంపిక చేయాలి, వేటిని వదలివేయాలి అని నిర్ణయించడం ఎంతో కష్టతర కార్యం. ఈ ప్రతిబంధకాలతో ఈ సంకలనాన్ని వెలువరించడంలో ఒకరకంగా సాహసం చేశామనే చెప్పవచ్చు. కాని ఉన్నంతలో వాటికి చక్కని ప్రాతినిధ్యం ఇవ్వటానికే ప్రయత్నించాం.

ఈ సంకలనంలోని రచనలు వివేకానంద స్వామి సర్వతోముఖ ప్రజ్ఞను తేటతెల్లం చేయటంలోను, ఆయన సందేశం ఎంత ప్రగాఢమో ఎంత సుదూరతీర పరివ్యాప్తమో మనకొక అవగాహనను కలిగిస్తాయనడంలోను సంశయం ఏమాత్రం లేదు.

స్వామీజీ సందేశాత్మక భావాలను అధ్యయనం చేయాలనే ఈనాటి యువతరానికి, పెద్దలకు ఈ సంకలన గ్రంథం ఉపకరిస్తుందని మేం విశ్వసిస్తున్నాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sodara Sodareemanulara