• Sivanandalahari
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శివానందలహరి

    Sivanandalahari

    Publisher: Victory Publishers

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''శంకరః సాక్షాత్‌ శంకరః'' అని స్తుతింపబడిన ఆదిశంకరాచార్యుడు పరమ శివ అవతారముగా పరిగణింపబడిరి. మానవ మనోవైకల్యానికి మూలకారణాలై వివిధ సిద్ధాంత చర్చోపచర్చలతో దిగ్భ్రమను కలిగించి, మానవుడు తన తోటి మానవుని ద్వేషించుటకు, హింసించుటకు, తోడ్పడుచుండిన వివిధ నాస్తికమత సిద్ధాంతముల కోలాహలము నుండి మానవ సమాజమును ఉద్ధరించి, విశ్వశాంతిని నెలకొల్పి, వివిధ విధములుగా ధర్మ రక్షణము చేయుటకు ఉద్భవించిన మనీషి, తత్త్వవేత్త ఆ ఆదిశంకరులే.

ఆదిశంకరులు రచించిన మూడు వందలకు పైగా వివిధ దేవతా స్తోత్రములలో అతిప్రసిద్ధమైనవి శివానంద, సౌందర్యలహరులు. ఈ రెండింటిలోను శివానందలహరి కేవలము భక్తిప్రధానమైన ఉత్తమ స్తోత్ర గ్రంథము.

శివానందలహరి అనగా శివుని సేవించుచున్నప్పుడు లేక ధ్యానించునప్పుడు భక్తులు పొందే ఆనందప్రవాహము అని అర్థం.

శివానందలహరిలో భక్తులు పొందునట్టి ఆ భక్తి ఎట్టిదో ఆ ఆనంద విశేషమెట్టిదో పూర్తిగా వివరింపబడినది. సాధారణముగా శంకరుల వారి దివ్యనామము వినగానే ఆయన మహా వేదాంతి అను విషయము గుర్తుకు వచ్చును. కాని ఆయన ఎంత గొప్ప వేదాంతియో అంత గొప్ప కవిపుంగవుడు. ఆయన కవిత్వము అమృత ప్రవాహము.

శివానందలహరియందు శంకరుల కవిత్వము నిరవద్య హృద్యమైనది. ఆయన కవితాశక్తిని తెలుపుటకు ప్రతి శ్లోకము సాక్ష్యమగును. శంకరులు శివుని గుణములను అనేక శ్లోకములలో వివరించిరి. ఆయన శ్లోకమునందలి విశేషణములు కొన్ని రూపవర్ణన పరములుగా ఉన్నను, కొన్ని పరబ్రహ్మ సూచకములు, సాభిప్రాయములు. శివుడు త్రయీవేద్యుడు. అనగా మూడు వేదములచేతనే తెలియదగినవాడు. చిదాలంబుడు, మహాదేవుడు, సకలజగద్యోగ క్షేమ దురంధరుడు, బాహ్యాంతర వ్యాప్తి, సర్వజ్ఞులు, నిత్యానంద రసాలయుడు, సురముని స్వాంతాభుజాతాలయుడు, తస్కరపతి, విహారి, పశుపతి, నిత్యుడు, కోటి సూర్యప్రభుడు, కైవల్య సౌఖ్యప్రదుడు, శివుని వర్ణించు జిహ్వయే జిహ్వ, ఆయనను దర్శించు నయనములే నయనములు. ఆయనను స్మరించువాడే ధన్యుడు.

ఇట్టి శ్లోకములు భక్తులకు మహానందము కలుగజేయును. పరమ మహాసుందరమగు ఆదిశంకరుల శివానందలహరి పఠితులందరికిని శివసాయుజ్యము కల్గించుగాక! ఇది భక్తితో చదువుకొని, పరమశివుని దయ పొందాలనుకొనేవారి కరకమలాలను అలంకరించాలని మా కోరిక.

- ఆవంచ సత్యనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Sivanandalahari