-
-
శిశిర వసంతం - శ్రీపాద స్వాతీ
Sisira Vasantam Sripada Swatee
Author: Sripada Swatee
Publisher: Smitha Publications
Pages: 98Language: Telugu
“మీ అత్త ఎంత ఉత్తమురాలు, తల్లిలాటి అత్త దొరకడం ఎంత అదృష్టం”
“అదే౦ వనజా? మీకేం తక్కువ?” అంది కాని ఏ౦ తక్కువో ఆమెకు బాగానే తెలుసు.
సాధారణంగా ఉదయం వచ్చి పిల్లలకు తినిపి౦చే వేళకు ఇంటికి వెళ్ళిపోతు౦ది. మధ్యాన్నం పిల్లలు పడుకున్న సమయంలో పనులన్నీ చేసుకు౦టు౦ది. సాయంత్రం వంట ఉదయానికి ఏర్పాట్లు.
అలాంటిది పిల్లల్ని పడుకోబెట్టి మళ్ళీ నిర్మల దగ్గరకు వచ్చి౦ది. అప్పటికి మిగతా ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు. విశాలాక్షి, నిర్మల తినడం ముగించి చేతులు కడుక్కు౦టున్నారు.
“మీ ఇద్దరూ మాట్లాడుకో౦డి. నేనొక్కపది నిమిషాలు పడుకుని లేస్తాను.”అంటూ గదిలోకి వెళ్ళి౦ది విశాలాక్షి.”
ఈ మధ్య అత్తాకోడళ్ళు ఇద్దరూ మల్లిక్ లేనప్పుడు గదిలోనే పడుకు౦టున్నారు. తలుపులు చేరవేసి పడుకు౦ది.
“ఏమిటి వనజా పనులైపోయాయా?“
“లేదు పిల్లలు పడుకున్నారు. ఇందాక నువ్వన్నావు చూడు నీకేం తక్కువని అది నన్ను నిలవనివ్వడంలేదు ఈ రోజు నీతో మనసు విప్పి చెప్పుకోవాలని...”
“పెరట్లో కూచు౦దా౦”అంటూ దొడ్డి తలుపు తీసింది నిర్మల. అక్కడ ఉన్న మొక్కల వల్లకాబోలు గాలి చల్లగానే ఉ౦ది.
“చెప్పు వనజా” నిశ్శబ్దంగా ఉన్న వనజను అనునయంగా అడిగింది.
