• Sirikona Vruksha Satakam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సిరికోన వృక్ష శతకం (free)

    Sirikona Vruksha Satakam - free

    Author:

    Publisher: Sirikona Prachurana

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహితీసిరికోన - ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారి సారథ్యంలో కొనలువేసి సాగుతున్న అధ్యయన వేదిక. సహృదయతకు ఆలవాలమై, విజ్ఞానకాండముతో చర్చాసుమసుగంధాల శాఖావిరాజమానమైన కల్పవృక్ష సమానమైన సదస్సు యిది. 'సాహితీసిరికోన’ పచ్చని తలపుతో ‘చెట్టు' ఇతివృత్తంగా ఒక శతకం రావాలని కోరిక పల్లవించి - అది ఈ విధంగా రూపు దిద్దుకొన్నది.

ఇందులో సుప్రసిద్ధులు, రససిద్ధులు, పద్యప్రేమికులు - వర్తమాన, వర్ధమాన రచయితలు / రచయిత్రులు - ఎందరో ఉత్సాహంగా పాల్గొని స్కంధ (కంద) పూజ గావించారు. 'సిరికోనా' అనే మకుటంలో పద్యాలు ప్రతిదినము సిరిమల్లెలలా వేదికపై గుబాళించాయి.

ఈ పద్యప్రసూనాలను దోయిలి బట్టి పూలమాలగా కూర్చు అదృష్టము వేదిక సారథులు నాకనుగ్రహించినారు. వారి సూచనల మేరకు అవసరమగు చోటుల కూర్పులు మార్పులు చేర్పులు చేసి - నా పరిజ్ఞానమునకు తగినట్లు సిద్ధపరచితిని. వివిధ కవుల కవితాలాపములందు సహజముగానే “సమశ్రుతి’ యొనగూడుట దుర్లభము. అది బృందగానమునందు ఆవిష్కరింపబడును. ఇదియు ఒక బృందగానమే కావున ఇచ్చట వ్యక్తిగతమైన గుర్తింపు గాక - ఖండికల సందేశము నందలి సమతుల్యత గమనించవలసి యున్నది. ఖండికల ఆనుక్రమణికకే ప్రాధాన్యమిచ్చి కూర్చబడినది. ప్రయోగశీలురైన సోదరకవుల కవితలు చివరకు ఉంచబడినవి.

- బులుసు వెంకటేశ్వర్లు