• Shadow In Cochin
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో ఇన్ కొచ్చిన్

    Shadow In Cochin

    Author:

    Pages: 99
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎదుటవున్న వైర్‌లెస్ ట్రాన్స్‌మీటర్ వైపు చూస్తూ, నిద్రపోకుండా వుండటానికి విశ్వప్రయత్నం చేస్తున్నది రిసెప్షనిస్ట్ బెట్టీ.

షాడో ముఖేష్‌లు ఎస్సైన్‌మెంట్ మీద బయలుదేరిన క్షణం నుంచీ ఓవర్ టైమ్ వర్క్ ప్రారంభం అయింది సి.ఐ.బి. హెడ్ క్వార్టర్స్‌లో.

ఉన్నట్లుండి బర్‌ర్ మని శబ్దం చేసింది బెట్టీ ఎడమచేతికి దగ్గరగా వున్న ఇంటర్ కామ్.

"బెట్టీ... ఎనీ న్యూస్ ఫ్రమ్ దోజ్ మంకీస్?" ఖంగుమంటూ వినవచ్చింది కులకర్ణిగారి కంఠం. వారిద్దరూ బయలుదేరి యింకా ఇరవైనాలుగు గంటలు కూడా కాలేదని ఆయనకు తెలుసు. కాని ఆయన టేబిల్ మీద వున్న బ్లూకలర్ టెలీఫోన్ ఆయన్ను విశ్రాంతిగా కూర్చోనీయటం లేదు.

"సారీసర్.... యింకా కంటాక్ట్ రాలేదు." వినయంగా సమాధానం యిచ్చింది బెట్టీ.

"ఆల్ రైట్ ...కంటాక్ట్ రాగానే నాకు తెలియచేయి... లేట్ చేయవద్దు" అంటూ ఇంటర్ కామ్‌ని ఆఫ్ చేశారు కులకర్ణి.

Preview download free pdf of this Telugu book is available at Shadow In Cochin