• Saswara Vedamantralu Samagram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    Print Book Help
    Out of stock

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • సస్వర వేద మంత్రాలు - సమగ్రం

    Saswara Vedamantralu Samagram

    Pages: 544
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 4 votes.
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 premium votes.
Description

మన మంత్ర సాహిత్యం అపారం. వేదఋషులు సాక్షాత్కరించుకున్న సత్యాలే సనాతన ధర్మానికి ఆధారాలుగా నిలిచి మంత్రరూపంలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఆ మంత్రాలే ఉపనిషత్తులుగా, సూక్తాలుగా, స్తుతులుగా - వేదవాజ్ఞయ వారసత్వాలుగా, ముక్తికి సోపానాలుగా భాసిల్లుతున్నాయి. అక్షరమయమైన మంత్రాలను స్వరయుక్తమైన రాగంతో, లయబద్ధంగా పారాయణ చేసినప్పుడు అంతర్గత ఈశ్వర చైతన్యం జాగృతం అవుతుంది.

ఆ అక్షరమయమైన మంత్రాలను వేదపారాయణ గ్రంథంగా 'సస్వర వేద మంత్రాలు' పేరిట మొట్టమొదటిగా 2005వ సంవత్సరంలో ముద్రించడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్నో ముద్రణలకు నోచుకుని, దేవాలయాలలోను, వేదపాఠశాలలోను, వేదవిద్యాలయాలలోను ఒక ఉపయుక్త గ్రంథంగా అలరారింది.

అయితే ఈ బృహత్‌ గ్రంథాన్ని దేవనాగరి లిపి నుండి తెలుగులోకి యథాతథంగా చేయడంలో సఫలీకృతులం కాగలిగినప్పటికీ, తొలి ముద్రణలలో కొన్ని తప్పులు దొర్లాయి. ఆ తప్పులను సరిదిద్ది, ఇప్పుడు ప్రామాణిక గ్రంథంగా తయారుచేసి మీ ముందుంచుతున్నాం. ప్రతులను అంకితభావంతో సరిచేసి ఇచ్చిన భక్తులందరికీ మా కృతజ్ఞతలు. తెలుగు పాఠకులకు, మరీ ముఖ్యంగా ఆస్తిక మహాశయుల ఆధ్యాత్మిక పురోగతిలో ఈ 'సస్వర వేదమంత్రాలు' మార్గదర్శిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదని విశ్వసిస్తున్నాం.

అదే విధంగా పాఠకలోకం ఈ గ్రంథాన్ని మునుపటిలాగే సమాదరిస్తారని ఆశిస్తూ...

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Saswara Vedamantralu Samagram