• Santhi Homam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శాంతి హోమం

    Santhi Homam

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆ కవర్ చదవటం పూర్తిచేసిన శివాజీకి దాదాపు మతిపోయినంత పనయింది.
సూర్యం చెప్పినట్లు కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం దొరికింది.
అతనికి అర్ధం కానిది ఒకటే!
టైగర్ తనని ఎందుకు సెంట్రల్ జైలు నుంచి తప్పించాడు... తన గురించి అన్ని వివరాలు ఎలా తెల్సుకున్నాడు?
ఎందుకింత సహాయం చేస్తున్నాడు?
తన మీద ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు?
టైగర్‌కు తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఎంతో ఆత్మీయంగా వ్రాశాడు.
ఏదో ఒక రోజు తను టైగర్‌ని కలుసుకొని తన ప్రశ్నలకు తనే సమాధానం తెలుసుకోవాలి. వెంటనే ఆ కవర్ని కాల్చి బూడిద చేశాడు శివాజీ.
"శివా! టైగర్ నీ విషయంలో ఎందుకింత సాహసం చేశాడో ముందు ముందు తెలియకుండా ఉండదు..... ఇప్పుడేం చేయాలో ఆలోచించు" అన్నాడు సూర్యం
"సూర్యం! నాకు అర్జెంటుగా జర్నలిస్ట్ దివాకర్ వివరాలు కావాలి" అన్నాడు శివాజీ
"ఆల్‌రైట్! నువ్వు రెస్ట్ తీసుకో.... ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు పొరపాటున కూడా బయటకు రావద్దు" అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
వెళ్ళేముందు ఇంటికి తాళం వేయటం మర్చిపోలేదు.
ఒంటరిగా కూర్చొని ఆలోచించడం ప్రారంభించాడు శివాజీ.

Preview download free pdf of this Telugu book is available at Santhi Homam