• Sanmanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సన్మానం

    Sanmanam

    Pages: 178
    Language: Telugu
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

కథా, నవలా రచయిత్రిగా, కాలమిస్ట్‌గా శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి పేరు తెలుగు పాఠకలోకానికి సుపరిచితమే. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా కథా రచయిత్రిగా ప్రేక్షకులకు అభిమాన రచయిత్రి ఆమె.

కథా రచయిత్రిగా విజయలక్ష్మిగారు బహుముఖీనమైన కథన కౌశలం చూపుతున్నారు. వ్యంగ్యం, హాస్యం ఆమె పలుకుల్లో, కథన శిల్పంలో అలవోకగా జాలువారుతాయి. ‘నగల గోవిందం’ ‘ఇట్టే వంట బట్టేసింది’ ‘చీరెల సుబ్బారావు’ ‘ఈ`పార్టీ’ వంటి కథల్ని చదివి ఆనందించండి.

మానవ సంబంధాలలోని సంక్లిష్టతని ఆవిష్కరించేప్పుడు ఇతివృత్తానికి ఆర్ద్రతని కూర్చి చదువరులకి గాఢమైన అనుభూతిని కలిగించగలరు. ‘సన్మానం’ ‘కుశాగ్ర బుద్ధి’ వంటివి దీనికి నిదర్శనం.

ఎంతెంతటి ఆధునిక సాంకేతికత, శాస్త్రవిజ్ఞానం విజృంభించినా - శాశ్వతమైన కుటుంబ బంధం అనే భావోద్వేగం మాత్రం ‘‘భారత రసాయన శాస్త్రం’’గా విలక్షణంగా లోకంలో నిలిచే ఉంటుంది అంటారు - అదే పేరు గల కథలో!

విజయలక్ష్మి గారు విలోమ కథలస్పెషలిస్ట్‌! ‘‘ఏలిన వారి దివ్య సముఖమునకు’’ అనే ఒక్క కథ చాలు - భారతీయ కథా రచయిత్రులలోనే ఆమెకి ప్రథమ పంక్తి స్థానం దక్కాలని చెప్పటానికి.

ఇంకా... ఇంకా... ఆమె కథలు మనిషి లోని బహు పార్శ్వాలు అనుభవ వైవిధ్యాన్ని చూపుతాయి. సాంస్కృతిక విలువల్ని గురించి ఆరాట పడతాయి. ‘రవ్వంత’ అనురాగాన్నీ, గోరంత ఆప్యాయతనీ చిత్తంలో నిలుపుకోండి’ అని నిరాడంబరంగా, అమ్మ మాటలాగా చల్లగా, మెల్లగా చెబుతాయి.

అదీ - ఈ విజయలక్ష్మి కథానికా గుచ్ఛం.

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Sanmanam
Comment(s) ...

జీవితమే ఇతివృత్తం! – “సన్మానం” పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4051