• Sankaranarayana English English Telugu Nighantuvu
  • Ebook Hide Help
    ₹ 400
    425
    5.88% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శంకరనారాయణ ఇంగ్లీషు - ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు

    Sankaranarayana English English Telugu Nighantuvu

    Publisher: S.R. Book Links

    Pages: 1712
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశ్వవ్యాప్త భాష ఇంగ్లీషు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రసిద్ధి పొందిన భాష తెలుగు. ఈ రెండు భాషల్లోను విశేష పరిశోధన, చేసి, శంకరనారాయణ గారు రూపొందించిన ఇంగ్లీషు - ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు తెలుగువారికి ఒక వరంగా చెప్పొచ్చు.

అయితే శంకరనారాయణ గారు ఈ పదకోశాన్ని రూపొందించి సుమారు వందేళ్ళయింది. ఈ వందేళ్ళ కాలంలో ఆంగ్ల భాషలో అనేక కొత్తపదాలు వచ్చి చేరి పదసంపద 10 లక్షలకు చేరింది. అలాగే శంకరనారాయణ గారు ఉపయోగించిన తెలుగు గ్రాంథిక శబ్దాలను అర్థం చేసుకోవడం నేటి తరం వారికి కొంత కష్టసాధ్యం, పరిశ్రమ అవసరం. ఆచంద్రతారార్కం అనే పదాన్ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతవరకు అని అర్థమయ్యేలా వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో శంకరనారాయణ గారు రూపొందించిన నిఘంటువులోని ఏ పదాన్నీ వదలకుండా, నేటి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా తెలుగు ఉచ్చారణ, పర్యాయపదాలు (Synonyms), వ్యతిరేకపదాలు (Antonyms). పదప్రయోగాలు - వీటితో పాటు మరిన్ని అదనపు అంశాలు జోడించి ఈ నిఘంటువును రూపొందించాము.

శంకరనారాయణ గారి నిఘంటువులో (Original dictionary) ఇంగ్లీషు మాట, దానికి తెలుగు అర్థం, ఆ తర్వాత ఇంగ్లీషు అర్థం (English - తెలుగు - English వరుసలో) ఇచ్చారు.

ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలలో ఆంగ్లానికున్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ పుస్తకంలో ఇంగ్లీషు పదం, దానికి ఇంగ్లీషు అర్థం ఇచ్చాక, తెలుగు అర్థం వచ్చేలా English – English - తెలుగుగా వరుస మార్చాం.

ఆంగ్లభాషలో విస్తృతంగా వాడుకలో ఉన్న పదాలను వరుసగా మూడు నక్షత్రాలు (***), రెండు నక్షత్రాలు (**), ఒక నక్షత్రం (*) తో సూచించాం.

ఇవేకాక, అనుబంధంలో నిత్యజీవితంలో ఉపయోగపడే వర్గీకృత పదపట్టికలు (Classified Vocabulary) చేర్చాం.

జీవద్భాష నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ జీవలక్షణానికి కరదీపిక నిఘంటువే.

- ఎస్.అర్. అకాడమిక్ యూనిట్

గమనిక: "శంకరనారాయణ ఇంగ్లీషు - ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు" ఈబుక్ సైజు 15.7mb

Preview download free pdf of this Telugu, English book is available at Sankaranarayana English English Telugu Nighantuvu