• SandesaTarangini Mariyu Lekhavali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • సందేశ తరంగిణి మరియు లేఖావళి

    SandesaTarangini Mariyu Lekhavali

    Pages: 832
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ఈ-బుక్ స్వామి వివేకనంద రచించిన "సందేశ తరంగిణి", ఆయన వ్రాసిన ఉత్తరాలు - "లేఖావళి" అనే రెండు పుస్తకాల సంపుటం

* * *

సందేశ తరంగిణి గురించి:

శ్రీమద్వివేకానంద స్వామి వారు 1893 వ సంవత్సరంలో అమెరికాలో జరిగిన ప్రపంచ మత మహాసభలో వేదాంతోపన్యాసాలిచ్చి అసదృశ దిగ్విజయం గావించి, పాశ్చాత్యఖండాలను హైందవమత ప్రచారంతో ఉర్రూతలూగించాక భారతదేశానికి తిరిగిబచ్చి, ప్రపథమంగా భారతీయ సోదరులను గురించి యిచ్చిన సందేశామృత సాగరంలోని ఉత్తుంగ తరంగరాసియే యీ ప్రసంగాల సంపుటం.

స్వస్వరూప జ్ఞానం కొరవడి నిద్రాణమైన భారతజాతిని తట్టి మేలుకొలపటానికి ఆసేతుహిమాచలపర్యంతం ముక్తకంఠంతో జాగ్రద్గీతాలను ఆలాపించిన నవయుగ వైతాళికుడు స్వామివారు. మహనీయమైన ప్రాచీన హైందవ తత్త్వవైభవాన్ని ప్రదర్శించి భారతీయులకు ఆత్మవిశ్వాశాన్ని, నూతనోజ్జీవాన్ని కలిగించిన దివ్యవాణి యీ గ్రంథం.

ఈ ప్రసంగాలలో నిర్భరమైన ఆవేదన, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, ఉద్వేగం, శక్తి కానవస్తాయి. ఈ యుగంలో భారతీయులకు నవచైతన్యం కలిగించిన మహాగ్రంథాల్లో యిదొకటి అనటంలో ఏ మాత్రం సంశయం లేదు.

లేఖావళి గురించి:

లేఖలు వ్యక్తి మనస్సును ప్రతిబింబిస్తాయి. చింతనాసరళి స్వేచ్ఛగా జాలువారే వ్యక్తిగత ఉత్తరాల నుండి ఆ వ్యక్తి మానసిక వికాసాన్ని తెలుసుకోగలం. ఈ కారణంగానే గొప్ప ప్రజాసేవకుల వ్యక్తిగత ఉత్తరాలకు అంత గిరాకీ ఏర్పడింది. ఈ లేఖల మూలంగా వారు సంతరించుకున్న వ్యక్తిత్వాంశాలు ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు; లేకపోతే అది మూతబడ్డ పుస్తకమే!

వివేకానంద స్వామి జీవితం భారతదేశ జాగృతి, భారతీయ మత పునరుత్థానంతో ముడిపడి ఉందన్న విషయం సువిదితమే. భారత జాతీయ జీవనంలో సర్వతోముఖ జాగృతిని తీసుకువచ్చే ప్రయత్నంలో ఆ మహాత్ముడు అనుభవించిన యాతన, ఆవేదన, మానసిక వ్యథ వర్ణణాతీతం.

ఈ పుస్తకంలో పొందుపరిచిన లేఖలలో ఆయన మహోద్యమ ప్రణాళికా, ఆ ఉద్యమ విజయానికి ఆయన ఎంచుకున్న విధానాలూ ప్రస్ఫుటంగా వ్యక్తమవుతాయి. ఒక వ్యక్తి జీవితంలో గొప్ప విప్లవ జ్వాలను రగిలించి, ఆతడిలో పరిపూర్ణ మార్పును తీసుకురావటానికి కేవలం ఆయన ఒక్క లేఖ, కాదు లేఖ లోని ఒక పేరా చాలు అనడం అతిశయోక్తి కాదు. ఈ దృక్కోణం నుండి పాఠకులు ఈ లేఖలను చదివితే సత్ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at SandesaTarangini Mariyu Lekhavali