-
-
సందేశ తరంగిణి
Sandesa Tarangini
Author: Swami Vivekananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 535Language: Telugu
స్వామి వివేకానంద 1893వ సంవత్సరంలో అమెరికాలో జరిగిన ప్రపంచ మతమహాసభలో వేదాంతోపన్యాసాలిచ్చి అసదృశ దిగ్విజయం గావించి, పాశ్చాత్యఖండాలను హైందవమత ప్రచారంతో ఉర్రూతలూగించాక భారతదేశానికి తిరిగివచ్చి, ప్రపథమంగా భారతీయ సోదరులను గురించి ఇచ్చిన సందేశామృత సాగరంలోని ఉత్తుంగ తరంగరాసియే ఈ ప్రసంగాల సంపుటం.
స్వస్వరూపజ్ఞానం కొరవడి నిద్రాణమైన భారతజాతిని తట్టి మేలుకొలపటానికి ఆసేతుహిమాచలపర్యంతం ముక్తకంఠంతో జాగృతి గీతాలను ఆలాపించిన నవయుగ వైతాళికుడు స్వామి వివేకానంద. మహనీయమైన ప్రాచీన హైందవ తత్త్వవైభవాన్ని ప్రదర్శించి భారతీయులకు ఆత్మవిశ్వాసాన్ని, నూతనోజ్జీవనాన్ని కలిగించిన దివ్యవాణి ఈ గ్రంథం.
ఈ ప్రసంగాల్లో నిర్భరమైన ఆవేదన, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, ఉద్వేగం, శక్తి కానవస్తాయి. ఈ యుగంలో భారతీయులకు నవచైతన్యం కలిగించిన మహాగ్రంథాల్లో ఇదొకటి అవటంలో ఏ మాత్రం సంశయం లేదు.
- ప్రకాశకులు

- ₹540
- ₹108
- ₹81
- ₹60
- ₹269.1
- ₹60.00
- ₹270
- ₹180
- ₹129.6
- ₹108
- ₹108
- ₹270