• Sanatana Bharati Revised
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 112.50
  125
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సనాతన భారతి - రివైజ్డ్

  Sanatana Bharati Revised

  Pages: 238
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

వేదభూమిగా, కర్మభూమిగా, తపోభూమిగా, పుణ్యభూమిగా పేరుపొందిన మన భారతదేశంలో ఎన్నో కోట్లమంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గల దేశం మనది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండవ పెద్ద దేశం మనది. విభిన్నమైన వాతావరణ పరిస్థితులలో జీవించే వివిధ జాతుల, మతాల, తెగల ప్రజా సముదాయాలుగల దేశం మనది. వైవిధ్యమైన వేషభాషలు, ఆచార వ్యవహారాలు గల దేశం మనది. ఇన్ని వైవిధ్యాలు గల ప్రజలను వైరుధ్యం లేకుండా ఏకీకృతం చేసేది మన సనాతన ధర్మం. “సనాతన” అనే పదానికి - అతి ప్రాచీనమైన, తరతరాలనుండీ సంక్రమిస్తున్న జాతి వారసత్వం అని అర్థం. భాషలు వేరైనా మన భావమొక్కటే... ప్రాంతాలు వేరైనా మన అంతరంగ మొకటే... అని కవులు చెప్పినట్లుగా మన సనాతన ధర్మం మనందరినీ సంఘటితం చేసే శక్తి. ఇదే భారతీయ ఆత్మ. మన వేదాల, పురాణాల సారం. మన సంప్రదాయాల, సదాచారాల సమాహారం. మనది ఏ మతం అని ప్రశ్నించుకుంటే మనకు సరైన సమాధానం రాదు. ఎందుకంటే ఒక మతానికి ఉండే పరిమితులకు అతీతంగా ఉంటుంది మన జీవన విధానం. హిందూమతంగా మన మతాన్ని కొంతమంది పేర్కొన్నా, కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా అనుసరించే సంప్రదాయాలెన్నో మన మతంలో ఉన్నాయి. అందుకే స్వామీ వివేకానందుడు చెప్పినట్లుగా హిందూ మతం ఒక మతం కాదు. ఒక జాతి మొత్తం జీవన విధానం. కాని మన గురించి, మన సనాతన ధర్మం గురించి చెప్పవలసి వస్తే, మనది వైదిక మతం అని చెప్పవచ్చు. మన మతానికి వేదాలు ప్రమాణం. వేదాలనుంచి వచ్చిన ఉపనిషత్తులు, ఆ తరువాత వచ్చిన ఇతిహాసాలు, పురాణాలు మనకు అందజేసిన నైతిక విలువలు, ధర్మ సూక్ష్మాలు, మానవ సంబంధాలు మన జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. ఇటువంటి సనాతన ధర్మం గురించి, మన ఆధ్యాత్మిక సంపద గురించి నేటి తరానికి, రాబోయే తరాలకు తెలియజేసే సదుద్దేశంతో వ్రాసినది ఈ వ్యాసావళి. భారతీయుల సనాతన ధర్మ విశిష్టతను ప్రతిబింబించే విధంగా దీనికి “సనాతన భారతి” అన్న శీర్షికను పెట్టడం జరిగింది.

ఈ ఆధ్యాత్మిక వ్యాస సంపుటిలో ముందుగా మన వైదిక మతం ముఖ్య లక్షణాలు, మౌలిక సూత్రాలు గురించి వివరించడం జరిగింది. తరువాత ఆధ్యాత్మిక జీవనం ఆవశ్యకత, వైదిక మతాలలోని రకాలు, వైదికేతర మతాలు, షడ్దర్శనాలు, భారతీయ సనాతన ధర్మం ఎదుర్కొన్న సవాళ్లు, ఆధ్యాత్మిక సంస్కరణోద్యమాలు గురించి వివరించడం జరిగింది. మన భారతీయ సంగీతం గొప్పదనాన్ని 'సంగీతము- మానసిక వికాసము' అనే వ్యాసం ద్వారా చెప్పటం జరిగింది. మనిషి జీవితాన్ని మనస్సు ఎలా శాసిస్తుందో ‘మనసు కథ' అనే వ్యాసంలో వివరించడం జరిగింది. చివరిగా భారతదేశంలో సనాతన ధర్మం లేక హిందూమతం భవిష్యత్తును గూర్చి చర్చించడం జరిగింది.

- జె.వి.వి. సత్యనారాయణ మూర్తి

Preview download free pdf of this Telugu book is available at Sanatana Bharati Revised