• Sampoorna Hanumath Charitramu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంపూర్ణ హనుమత్‌ చరిత్రము

    Sampoorna Hanumath Charitramu

    Pages: 239
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

సంపూర్ణ హనుమత్‌ చరిత్రము

వచనకావ్యము

పెద్దబాలశిక్ష చదువుకొనే పిల్లలు మొదలు వేదార్థం చెప్పుకొనే వేదభాష్య విశారదుల వరకు అందరికి ఆరాధ్యదైవం ఆంజనేయుడు. రామ కార్యాలన్నింటిని చక్కబెట్టిన వాడు హనుమ. అందువల్ల ' శ్రీరామరక్ష' అంటే 'ఆంజనేయ రక్ష' అనే అర్థం. ఆ రక్షను ఆశించే, చంటిపిల్లల మెడకు ఆంజనేయ బిళ్ల కడతాం. ఎంత సంపన్నుని పుత్రరత్నానికైనా ఆ రక్షాకవచం లేకుండా ఎన్ని నగలు పెట్టినా అందగించదు.

హనుమ వాయుపుత్రుడు. వాయువు స్తంభిస్తే ప్రాణచలనం ఆగిపోతుంది. 'ఆత్మావై పుత్రనామాసి' అనే న్యాయం చొప్పున హనుమ ముఖ్యప్రాణదేవత ఐనాడు. పరోపకారమే పరమార్థంగా స్వార్థం ఇసుమంతైనా లేని అవతారం అది. కర్మ, భక్తి జ్ఞాన మార్గాల సమన్వయ స్వరూపం అది. దైవం పట్ల దేహబుద్ధ్యా దాసభావాన్ని, మనోబుద్ధ్యా అంశత్వాన్ని, ఆత్మబుద్ధ్యా ఏకత్వాన్ని ప్రకటించి అందరికి ఆదర్శప్రాయుడైన వాడు... హనుమ. జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గుర్తించి, భక్తితో మనసును పూజా ప్రసూనంగా సమర్పించి, నిష్కామ కర్మాచరణతో 'భవిష్యద్బ్రహ్మ' ఐనాడు హనుమ. ఆయన సంపూర్ణ చరిత్రను అధ్యయనం లేదా పారాయణ చేసిన భక్తులు ఇహపరాలను సాధిస్తారనటంలో సందేహం లేదు.

అమిత విక్రముడు, జ్ఞానగరిష్టుడు, బ్రహ్మచర్యవ్రతుడు, సూర్యతేజుడు, సకలవిద్యా పారంగతుడు అయిన వాయునందనుని పుట్టుపూర్వోత్తరాల గురించి మనకు కొద్దిగానే తెలుసు. సకల పురాణేతిహాసాలలో హనుమను గురించి పేర్కొన్న విషయాలన్నింటిని సంగ్రహించి 'సమీరకుమార విజయం' పేరున 17వ శతాబ్దిలో శ్రీ పుష్పగిరి తిమ్మనార్యుడు పద్యరూపంలో వ్రాసిన కావ్యానికి వచనరూపం ఈ గ్రంథం. పద్యరూపంలో వున్న ఈ కావ్యాన్ని సరళసుందరమైన వచనంలోకి అనువదించి అశేషంగా వున్న హనుమద్భక్తులందరికి తెలియపరచాలని సంకల్పించినవారు శ్రీ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు. బహుగ్రంథం కోవిదులు, సాహితీ ధురంధరులు అయిన శ్రీ సత్యనారాయణ మూర్తి గారి సంకల్పం, కృషి ఫలించాలని ఈ పుస్తకాన్ని మీ ముందుంచుచున్నాము.

పంచుకోవలసింది ఆర్తిని, పంచి పెట్టవలసింది జ్ఞానాన్ని అనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని మీ ముందుంచుతున్నాం. మఠం గ్రంథాలను సమాదరిస్తూ ఆధ్యాత్మిక లబ్ధిని పొందుతున్న తెలుగు ప్రజలు ఈ గ్రంథాన్ని కూడ ఆదరించి మమ్ములను కర్మ పరిపోషకులుగా చేయగలరని ఆశిస్తూ...

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sampoorna Hanumath Charitramu