• Sambhavami Yuge Yuge
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంభవామి యుగే యుగే

    Sambhavami Yuge Yuge

    Author:

    Pages: 208
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భగవంతుడు దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ఆయా యుగాలలో భూమిపై అవతరించి భక్తపాలన చేస్తాడు. ఈ అవతారాలు పదియని, కాదు ఇరువది ఒకటి అని రకరకాల పురాణాలు చెప్తున్నాయి. లోకంలో ప్రసిద్ధంగా వున్నది దశావతార మహిమయే. వివిధ పురాణాంతర్గతమైన భిన్నకథల ఆధారంగా దశావతార తత్వరహస్యాన్ని చెప్పాలనే సంకల్పంతో కథాత్మక రూపంలో చేసిన ప్రయత్నమే ఇది.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఆయనను పదకవితార్చనతో అర్చించి తరించిన పదకవితా పితామహుడు, వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయనలో ఆధ్యాత్మిక సామాజిక భావజాలం అపారం. ఆయన ద్వారా ఈ కథాకథనం కొనసాగుతుంది. దశావతారాలలో బుద్ధ, కల్కి అవతారాలను స్పృశించలేదు.

కథ అందరికీ తెలుసు. కానీ అందులోని ఆంతర్యం, ఆధ్యాత్మిక భావన పురాణగాథల ఆధారంగా చెప్పటానికి ప్రయత్నించాను. అన్నమయ్య వాగ్రూపంగా వెలువడిన కథాకథనం కాబట్టి అన్నమయ్య కీర్తనలను యధాతథంగా, సందర్భానుసారంగా వాడుకున్నాను. అవసరాన్ని బట్టి భక్తి భావరసతుందిలమైన పోతన భాగవత పద్యాలు కొన్ని, ఇతర ప్రసిద్ధ శ్లోకాలు కొన్ని ఉదాహరణ మాత్రంగా ఉటంకించాను. సహృదయహృదయైుకవేద్యం కాగలదని విశ్వాసం.

ఈ గ్రంథాన్ని ఆ శ్రీనివాసుని పాదాలకు పుష్పగుచ్ఛంగా సమర్పిస్తున్నాను.

- ఆర్‌. శోభాదేవి

Preview download free pdf of this Telugu book is available at Sambhavami Yuge Yuge
Comment(s) ...

చాలా మంచి పుస్తకం. రచయిత్రికి అభినందనలు - సుబ్రహ్మణ్యం తురగా

Dasavatarala pye manchi parisodhana