• Sambhavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 105.6
    132
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంభవం

    Sambhavam

    Pages: 302
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషికైనా, జంతువుకైనా, ఒకటే ఆపరేషన్‌ ప్రక్రియ. సునిశితంగా, అప్రమత్తంగా ఆ ఆపరేషన్‌ని చేస్తోంది డా. విజేత. నిశ్శబ్దంగా ఆ ప్రక్రియను చూస్తున్నాడు సవ్యసాచి.

ఈ ప్రక్రియలో ప్రధానమైన అంశం బ్రతికున్న కుందేలుని నిర్జీవంగా చెయ్యడం. నిర్జీవంగా చేసిన కుందేలును మళ్ళీ బ్రతికించడం!

కొన్ని నెలల తర్వాత మనిషి శవం మీద జరిగే ప్రయోగానికి అది ఒక నాంది మాత్రమే.

మృత్యువును ఎదుర్కోడానికి మనిషి పూరిస్తున్న విజ్ఞాన శంఖారావం అది! అయిదు నిమిషాలు గడిచాయి-

కుందేలు బ్రెయిన్‌ వేవ్స్‌ ఆగిపోయాయి. అలాగే గుండె కూడా- మెడికల్‌ టర్మ్‌నాలజీలో దానినే మరణం అంటారు.

వెంటనే విజేత రివార్మింగ్‌ ప్రోసెస్‌ని మొదలెట్టింది. ముందుగా మెంబ్రెయిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడంతో ఆ ప్రోసెస్‌ మొదలైంది. క్షణంలో కణాలన్నీ అనుసంధించబడ్డయి. రేడియో ఫ్రీక్వెన్సీ రివార్మింగ్‌ ద్వారా బాడీని ఐస్‌లోంచి తియ్యడం, యాంటీఫ్రీజింగ్‌ ప్రొటెక్షన్‌ కల్పించిన గ్లిసరాల్స్‌ని వెనక్కి తియ్యడం, చకచకా పనుల్ని చేస్తోంది విజేత.

కుందేలు బాడీని కంప్యూటర్‌ మానిటర్‌ మీద స్క్రీన్‌ని రెప్ప వేయకుండా చూస్తోంది ఆమె.

''టెంపరేచరు ట్వంటీ సెవన్‌ పాయింట్‌ సెవన్‌'' చెప్పింది ఆమె.

కుందేలుపిల్ల తలకు కనెక్ట్‌ చేయబడిన ఎలక్ట్రోడ్స్ స్క్రీన్‌ వైపు చూశాడు సవ్యసాచి.

సవ్యసాచికి బయోకెమిస్ట్రీ గురించి తెలుసు. అందుకే అతని నరాల్లో రక్తచలనం హెచ్చింది.

కొన్నివందల ప్రయోగాలు ఇప్పటివరకూ విఫలమయ్యాయి. పరాజయం ఎప్పుడూ ప్రయోగానికి ఒక ఒడ్డు మాత్రమే. సముద్రంలో ఈదులాడుతున్నప్పుడు ఢీకొన్న ఒక అల పరాజయం. అవతలి తీరానికి చేర్చడనికి
మరో అల ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది!

సవ్యసాచి, అతనితో పాటు పనిచేసే వ్యక్తులు నమ్మే ఆశావహ సిద్ధాంతం అది.

ఎలక్ట్రోడ్స్ స్క్రీన్‌ మీద గీతలు మెల్లగా కదలడం ప్రారంభించడంతో సంతోషంతో చిన్నగా ఈల వేశాడు సవ్యసాచి ఒక్కసారి.

విజేత ముఖంలో ఆనందం పెల్లుబికింది. ఆశ్చర్యంగా, ఆనందంగా సవ్యసాచి కళ్ళల్లోకి చూసి, తలతిప్పి మానిటర్‌ వైపు చూసిన ఆమె ముఖం చిన్నబోయింది.

Preview download free pdf of this Telugu book is available at Sambhavam
Comment(s) ...

Gud one with lot of details about the cryonics.
But as his every book, the climax is jerked.