• Sai Deevena - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సాయి దీవెన (free)

    Sai Deevena - free

    Author:

    Pages: 384
    Language: Telugu
    Rating
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    '4.80/5' From 10 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీసాయిని అనన్యంగా ప్రేమించి, ఆరాధించి, సాయి మనన స్మరణలే శ్వాసగా జీవించి, సాయి ప్రబోధాన్ని పంచి, సాయిలో తాదాత్మ్యం చెందిన మహాత్ములు - పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబుజీ.

వారి మాటలో సాయి(తత్త్వం), మౌనంలో సాయి(చింతన), స్మరణలో సాయి(నామం), స్ఫురణలో సాయి(రూపం), తనువంతా నిండి హృదయమ్లొ కొలువుదీరివున్న ఆ సాయినాథుడే ఆ మహనీయుని సర్వస్వం. శ్రీసాయి ప్రబోధాలు అక్షరసత్యాలని నిరూపించిన ఆ మహనీయులు, సాయి అనుగ్రహానికి, దివ్యత్వానికి, ప్రేమకు నిలువెత్తు రూపమై నిలిచారు. శ్రీ సాయి అగాధతత్త్వ సాగరాన్ని మధించి సుజ్ఞానామృతాన్ని ప్రసాదించారు.

శ్రీసాయినాధుని శరత్‌బాబూజీతో సాయిభక్తులకు గల అనుభవాలు, అనుభూతులు, మధురస్మృతుల సమాహారం - ఈ 'సాయి దీవెన'.

తమ జీవితాలను ఆనందమయం చేసిన ఆ మహాత్ముని ప్రేమను చవిచూసిన అశేష భక్తజనావళి గుండె చప్పుడు - ఈ 'సాయి దీవెన'.

భక్తుల జీవితాల్లో విరబూసిన అనుభవసుమాలతో ఆ మహనీయుని పాదాలకు చెసిన అక్షరార్చనం - ఈ 'సాయి దీవెన'.

తమ జీవనజ్యోతులను సాయి అనుగ్రహధారతో వెలిగించిన మహితమూర్తికి భక్తులు తమ హృదయజ్యోతులను హారతిగా చేసి అర్పించిన నీరాజనం - ఈ 'సాయి దీవెన'.

ఈ అనుభవాల సమాహారంలోని ప్రతి అనుభవంలో, శ్రీబాబూజీ సత్సంగ భాషణలో జాలువారిన సుజ్ఞానరత్నాలు, ఆణిముత్యాలు, కూడి ఉన్నాయి. ప్రతి అనుభవంలో సద్గురుని అగాధతత్త్వం దాగి ఉంది. సాయి తత్త్వసారం - ప్రబోధం ఉంది. వ్యధాకలిత భక్తుల హృదయస్పందన ఉంది. అందుకు సద్గురు ప్రతిస్పందనా ఉంది.