• Sahityamante Emiti Apprciation of Literature
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాహిత్యమంటే ఏమిటి

    Sahityamante Emiti Apprciation of Literature

    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యమంటే ఏమిటి

వాడ్రేవు చినవీరభద్రుడు

మనిషి వాక్కు గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ప్రతీ వాక్కు, ఒక అద్వితీయ సంస్కృతీబీజమనిపిస్తుంది.

ఎన్ని కంఠాలు వినబడితే అంత సాంస్కృతిక వైవిధ్యాన్ని మనం చూడగలుగుతాం. పాట ఒక్కటే అయినప్పటికీ గాయకుడి నుంచి గాయకుడు, తమ తమ స్వరవిలక్షణతో దానికి సౌందర్యాన్ని చేకూర్చినట్లుగా, సంస్కృతి ఒకటే ఐనా వాక్కు నుంచి వాక్కుకి దాని వైవిధ్య విన్యాసాన్ని చూడడంలో ఒక అస్తిత్వ సంతృప్తి ఉంది.

నిజజీవితంలో మనకి సన్నిహితులైన అనేకుల కంఠాలు ఏ ఒక్కటీ ఒక దానిలా మరొకటి ఉండవు. కానీ ప్రతీ కంఠాన్ని గుర్తుపట్టడానికీ దానికై ప్రతిస్పందించడానికీ, మనలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ఒకటేదో ఉంది. అందులో ప్రతీ కంఠాన్ని గుర్తు పట్టడమే కాకుండా ఆ ప్రాణస్పందనికి మన హృదయాన్ని అనుసంధానించే స్ట్రింగ్స్ కూడా ఏవో ఉన్నాయి. అందుకనే మనకు పరిచితమైన ప్రతీ కంఠం మననలరింప చేస్తుంది. అప్పుడే ఒక కంఠం మనకి కొత్తగా పరిచితమవుతున్నప్పుడు కూడా, మనలోని ప్రాసెసర్, ఆ కంఠంలోని ప్రాణస్పందనని దాని విలక్షణతో, అద్వితీయమైన దాని కొండ గుర్తులతో నమోదు చేసుకుంటుంది. ఇకా కంఠం ఎప్పుడు వినిపించినా అది ఎదుటి వారి అస్తిత్వానికీ, మన అస్తిత్వానికి కూడా నిదర్శనంగా, సంతోషకారకంగా మనవి చేరవేస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Sahityamante Emiti Apprciation of Literature