• Sahiti Virupakshudu Vidwan Viswam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 100
    200
    50% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం

    Sahiti Virupakshudu Vidwan Viswam

    Pages: 263
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ విద్వాన్ విశ్వం గారి శతజయంతి సందర్భంగా "సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం" ఈబుక్, ప్రింట్ పుస్తకంపై పరిమితకాల ప్రత్యేక తగ్గింపు. త్వరపడండి.

* * *

విశ్వంగారు ఎంత గొప్ప రచయితో అంత గొప్ప హృదయం గల మనిషి అని ఆనాడే నేను తెలుసుకున్నాను. ప్రతిభావంతులు చాలామంది ఉంటారు లోకంలో. కానీ, మనస్సు విప్పి మాట్లాడి సాటి రచయితలను తన వాళ్ళుగా భావించి సాటివారి శ్రేయస్సుని కోరేవారు అరుదు. ఆ సద్గుణం మేము విశ్వంగారిలో చూశాము.

- డా. దాశరథి

విశ్వం నిండుకుండ. తొణకరు, బెణకరు. భావాల్లో అతివాది. మాటల్లో మితవాది. నిగర్వి. మందహాసంతో అందర్నీ హుందాగా పలకరించే విశాలతత్వం. మెరమెచ్చుల కోసం ఎవర్నీ ఆకాశానికెత్తి పొగడరు. తాను నమ్మిన సత్యాన్ని నమ్రతగా అందలమెక్కిస్తారు.

- డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

తోటి సహాధ్యాయుల యెడ వారి ఆప్యాయత, సౌమనస్యత మొదలైన వారు గుణాలు మమ్ములను ఎంతగానో ఆకర్షించినవి. అంత మాత్రాన వారు దృఢమనస్కులుగారని కాని, వారికి నిశ్చితాభిప్రాయాలు లేవని కాని కాదు. వారు నివురుగప్పిన నిప్పువంటి వారు. కలహప్రియులు కారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్నేహబంధాలకు అంతరాయం కలగకుండా మెలగడం వారి విశిష్టత.

- చండ్ర రాజేశ్వరరావు


కన్నీటి సుడులెన్నో కూర్చి 'పెన్నేటి పాట'గా తీర్చి
రాళ్ళలో మేల్కొల్పినావు రసదిగ్ధ భావామృతార్చి
'మాణిక్యవీణ'పై నీవు మత్యంగుళులు సాచినావు
పదునైన లోకవృత్తాలు అదునెరిగి పలికించినావు!

- డా. సి. నారాయణరెడ్డి

Vidwan Viswam is a Poet, Literateur, Scholor, Softspoken Strongman and a popular Editor who could successfully pool the writing talent. Ofcourse, he has his own share of tears and his fortitude during the times of sorrow and stress was known only to a very limited circle.

- N.R. Chandur

Preview download free pdf of this Telugu book is available at Sahiti Virupakshudu Vidwan Viswam