• Sadhu Sangatyam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాధు సాంగత్యం

    Sadhu Sangatyam

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సుదూర ప్రాంతం నుండి వచ్చిన యాత్రిక బృందం ఓ చోట చేరి నిద్రిస్తున్నారు. ఓ రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సకల పాపాలు పరిహారమౌతాయని వారి విశ్వాసం. ఘాడనిద్రలో వున్నప్పుడు పదేళ్ళ పిల్లవాడు వచ్చాడు. వాడు ఓ పిచ్చివాడు. ఏ తల్లో కనీ ఈ ప్రాంతంలో వదిలేసి వెళ్ళింది. వాడు మతి స్థిమితం లేక, ఆకలికి తట్టుకోలేక అర్ధరాత్రి వేళలో నిద్రించే బృందం వద్దకు వెళ్ళాడు. తినడానికి ఏమైనా ఉన్నాయోమోనని వెదికాడు. చప్పుడుకు బృందంలో ఒకరికి మెలుకువ వచ్చింది. వాడిని దొంగే అనుకున్నాడు. పెద్దగా అరుస్తూ అందరిని లేపాడు. లేచినవారు లేచినట్టు వాడిని కొడుతున్నారు. అప్పుడే సాధువు అక్కడికి వెళ్ళాడు. విషయం గ్రహించాడు. కొట్టవద్దని వారించాడు. పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నాడు. ఆప్యాయంగా వాడి తల నిమిరాడు. యాత్రికుల బృందం వంక చూసి “అయ్యాలారా! మీరు చాలా ధన్యులు. సాక్షాత్తు పరమ శివుడే ఆకలితో మీవద్దకు వచ్చాడు. పెట్టకుండా కొట్టారు. అయినా పిల్లవాడిని కొట్టే అధికారం మీకెవరిచ్చారు. మీ విలువైన వస్తువులు ఏం దొంగిలించాడని? మీరు యాత్రికులు వెంట ఏం తెచ్చుకుంటారు. వండుకునే సామానులు తప్ప ఏముంటాయి? వాటికోసమేనా? పసివాడిని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి ఇంత దూరం వచ్చారు. పుణ్యం కోసమేగా? ఇదేనా మీరు. మూటకట్టుకున్న పుణ్యం, ఈ భూమి మీదకు మీరేం తెచ్చారు. ఏం తీసుకు వెళతారు. ఎందుకింత కోపం. నీదంటూ ఈ భూమిపై ఏదైనా ఉందా? అన్ని భగవంతుడు ఇచ్చినవేగా! ఆయనవి ఆయనకు ఇవ్వటానికి మీకు ఇబ్బంది ఏమిటి? ఈ పిల్లవాడికి మీరు ఏం ఋణపడి వున్నారో. వాటిని తీసుకుపోవటానికి వచ్చాడని గ్రహించరెందుకు?” అని ఆపిల్లవాడిని తీసుకువెళ్లాడు.

సాధువు మాటలకు అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. చాలా అధికారంతో మాట్లాడాడు. యాత్రికుల కళ్ళు తెరిపించాడు. వారంతా ఆయనను ఓ దేవుడిని చూసినట్టు చూశారు. ఆయనను వెలుగులో చూడాలనే ఆశతో ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారు. పిల్లవాడు సాధువు వడిలో ఒదిగిపోయాడు. నిద్రలోకి జారుకున్నాడు. అంతా సద్దుమణిగింది. నిసి రాత్రి నిర్భయంగా రాజ్యమేలుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Sadhu Sangatyam