• Rudrudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 126
    140
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రుద్రుడు

    Rudrudu

    Author:

    Pages: 366
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 13 votes.
    3.29 Star Rating: Recommended
    3.29 Star Rating: Recommended
    3.29 Star Rating: Recommended
    3.29 Star Rating: Recommended
    3.29 Star Rating: Recommended
    '3.29/5' From 7 premium votes.
Description

అంతవరకూ తను మాట్లాడే ప్రతి మాటకు ముందూ, ఆ మాటలకు సంబంధం లేని పదాలను ఉచ్ఛరిస్తున్న మరుగుజ్జు ముఖం మీద కాంతి వెలాతెలా పోయింది. నేరేడు పళ్ళ మాదిరి నిగనిగ మెరుస్తున్న అతని నల్లని కళ్ళల్లో జీవం నశించినట్లు మెరుపు తగ్గిపోయింది.

''అడగకూడనిదేదయినా అడిగి నీ మనసును బాధపెట్టి వుంటే మమ్మల్ని మన్నించు... ఒకటిగా నడుస్తున్నాము. ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవటం మంచిదనే వుద్దేశ్యంతో అడిగాను....'' వెంటనే అన్నాడు మదనుడు.

''అన్నదానం... ఐరావతం... అటువంటిదేమీలేదు బుడత .... ప్రాణదానం చేసిన మీకు చెప్పకూడని రహస్యాలు కూడ ఏమీ లేవు... మా కొండదేవర గుడి మీద దాడి చేశారు ఈ బందిపోట్లు....'' బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు మరుగుజ్జు.

''గుడిని పడగొట్టి నేలమట్టం చేసేశారా?'' అడిగాడు మదనుడు.

''అంతకంటె అధికంగానే చేసేశారు. మా తాతలకంటె వయసులో పెద్దవాడయిన మా పూజారయ్యను చితకబాది మా కొండదేవర ఆయుధమైన శూలాన్ని ఎత్తుకు వచ్చేశారు....'' చెప్పాడు మరుగుజ్జు.

ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు స్నేహితులు ఇద్దరూ.

''ప్రాణం లేని ఒక బొమ్మ చేతిలో వున్న ఇంకో బొమ్మనే కదా మీరు పోగొట్టుకున్నది. ఇంకో దాన్ని తయారుచేసి ఆ బొమ్మ చేతిలో పెట్టేస్తే సరిపోతుంది కదా....'' నెమ్మదిగా అన్నాడు రుద్రుడు.

అతను ఏదో తప్పు మాట్లాడినట్లు ఒక్కసారిగా ఎర్రబడిపోయింది మరుగుజ్జు వదనం.

''కళ్ళు పోతాయి. చేతులు పిపోతాయి... కొండదేవర ఆయుధం అంటే సామాన్యమైంది కాదు... గట్టిగా పట్టుకుని గురిచూసి వదిలితే కొండరాళ్ళను కూడ పిండి పిండి చేసి తిరిగి వస్తుంది....'' అన్నాడు పెద్ద కంఠంతో.

అకారణంగా అతను కోపం తెచ్చుకోవటాన్ని చూసి, తను కూడ పెద్దగా ఏదో సమాధానం ఇవ్వబోయిన రుద్రుడిని బలవంతంగా ఆపేశాడు మదనుడు.

''ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి... తెలిసీ తెలియని తనంతో వెక్కిరించటం తప్పు. పూర్తిగా చెప్పనీ'' అంటూ తిరిగి మరుగుజ్జు కేసి చూశాడు.

Preview download free pdf of this Telugu book is available at Rudrudu
Comment(s) ...

Can i read the purchased book in another device in the event of this device/app not available.

rudrudu book rent lo download kavatam ledu endukani