-
-
రాకెట్ కుర్రాళ్ళు
Rocket Kurrallu
Author: Dr. Srinivasa Chakravarthi
Publisher: Manchi Pustakam
Pages: 48Language: Telugu
మన దేశంలో, సంస్కృతిలో సైన్స్ అంశాల మీద సినిమాలు చాలా తక్కువ. ఎప్పుడో తప్పజారి సైన్స్‌కి సంబంధించిన సినిమా తీసినా అవి దేవుళ్ళు, దయ్యాలు, సైన్స్, నాన్సెన్స్ అన్నీ కలగలిపిన సినిమాలు తప్ప శుద్ధమైన సైన్స్ అంశాలమీద పకడ్బందీగా తీసిన సినిమాలు బహుతక్కువ. దానికి కారణాలు కొత్తేమీ కాదు. ఒక ఆధునిక సమాజంలో సైన్స్ ఎలాంటి సహజ పాత్ర పోషించాలో అలాంటి పాత్ర ఇంకా మన సమాజంలో పోషించడం లేదు.
సైన్స్ ప్రయోజనాలని కొంత వరకు వాడుకుంటున్నాం తప్ప సైన్స్ తత్వం మన సామాన్య సామాజిక చింతనలోకి లోతుగా ఇంకా ప్రవేశించలేదు. సైన్స్ ప్రభావం బలంగా ఉంటే మన సమిష్టి జీవనం ఇంత కల్లోలంగా ఉండదు. సైన్స్ అంటే కేవలం ఉద్యోగావకాశాలని పెంచే ఒక పనిముట్టుగా చూడకుండా, సమిష్టి జీవన ప్రమాణాలని పెంచే ఒక ప్రబల శక్తిగా స్వీకరించాలి.
జీవితాన్ని, ప్రపంచాన్ని వైజ్ఞానిక దృష్టితో చూసే అలవాటు మన చేతనలో గాఢంగా నాటుకు పోవాలి. సైన్స్ సమాచారం కేవలం ''సైన్స్ విద్యార్ధులకి'', ''శాస్త్రజ్ఞులకి'' మాత్రమే పరిమితం కాకూడదు. సైన్స్ అందరి సొత్తూ కావాలి. వైజ్ఞానిక భావ లహరులు సర్వత్ర సహజంగా ప్రవహించాలి.
మన సినిమాలలో, సాహిత్యంలో, జీవన వ్యవస్థలలో, దైనిక జీవనంలో దోషంలేని, సమున్నతమైన వైజ్ఞానిక పరిజ్ఞానం అభివ్యక్తం కావాలి.

- ₹118.8
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60