• Repalle Rangasthali
  • Ebook Hide Help
    ₹ 150 for 30 days
    ₹ 720
    720
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేపల్లె రంగస్థలి

    Repalle Rangasthali

    Pages: 594
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

తెలుగు'నాట'క వికాసంలో రేపల్లీయుల పాత్రను తెలిపే పరిశోధనా గ్రంథం - రేపల్లె రంగస్థలి.

* * *

'కేవలం నాటక చరిత్రకే పరిమితం కాకుండా గ్రామచరిత్రలు వివరించే సందర్భంలో చారిత్రక, పౌరాణిక, సామాజిక, భౌగోళిక అంశాల ప్రాధాన్యతను వాటి ప్రభావం నాటకచరిత్రపై వీడిన తీరు గ్రంథస్థం చేయటం - నాటక సంబంధిత భిన్న శాఖలలో రేపల్లీయుల కృషిని రాష్ట్రస్థాయి కృషితో తులనాత్మకంగా విశ్లేషించటం - నాటకావిర్భవ పూర్వ చరిత్ర నాట్యశాస్త్రములను సంక్షిప్తంగా పరిచయం చేయటము' వంటి విశిష్టతలుండుటచే గొప్ప ప్రయోజనం సాధించిన గ్రంథముగా దీన్ని భావిస్తున్నాము.

- మండలి బుద్ధప్రసాద్

* * *

తెలుగు నాటక సాహిత్యములో "రేపల్లె రంగస్థలి" ఒక అసాధారణ పరిశోధనా గ్రంథము. ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. క్షేత్ర సందర్శనతో విషయసేకరణ చేశారు. అంటే రేపల్లె తాలూకాలో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడి పరిస్థితులను ముఖ్యంగా నాటక ఆవిర్భావ వికాస దశలను, ఆ దిశలో కృషి చేసిన కళాకారుల, రచయితల వివరాలను స్వయంగా తెలుసుకొని గ్రంథస్థం చేయడం ఈ గ్రంథానికి ప్రామాణికతను తెచ్చిపెట్టింది. ప్రతి గ్రామంలో నెలకొన్న ఆర్ధిక, సామాజిక, ఆధ్యాత్మిక భౌగోళిక పరిస్థితులు నాటకంపై చూపిన ప్రభావం వెల్లడించడంతో యీ గ్రంథానికి ఒక విలక్షణత అబ్బింది. ఆ విధముగా నాటక చరిత్ర రచనలో ఒక నిండుతనం చేకూరింది.

- గండవరం సుబ్బరామిరెడ్డి

* * *

తరతరాల చరిత్రను ఒక్క గ్రంథముగా కుదించి పర్యావలోకనము చేయడమంటే కొండను అద్దంలో చూపినట్లే. ఐనా వామన రూపంలోనే విరాట్ రూపం ఇమిడిపోయిన తీరు ఈ రచనకు మణిహారంలా నిలుస్తుంది. పూర్తిగా శాస్త్రీయ ప్రమాణాలలో సాగిన ఈ రచనలో వ్యక్తిగత దూషణలు లేవు, వెక్కిరింతలు లేవు. విమర్శ వున్నచోటల్లా యదార్థత, క్రమబద్ధత, తర్కబద్ధత త్రివేణి సంగమమై వున్నాయి. పఠితులను ఇట్టే కట్టిపడేసే శైలి ఈ గ్రంథానికి మకుటాయమానమై నిలుస్తుంది.

- పితాని సౌమిత్రి శ్రీనివాస్ చక్రవర్తి

గమనిక: "రేపల్లె రంగస్థలి" ఈబుక్ సైజు 10.3 MB

Preview download free pdf of this Telugu book is available at Repalle Rangasthali