• Rendu Hasya Natikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెండు హాస్య నాటికలు

    Rendu Hasya Natikalu

    Pages: 70
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో రెండు హాస్య నాటికలు వున్నాయి. వీటిలో మొదటిది గజలక్ష్మీ కళ్యాణం 1978లో వ్రాసినది. సినిమాలమీద, తిండిమీద మాత్రమే ఆసక్తి వున్న తమ కూతురు గజలక్ష్మికి వివాహం చేయటానికి తల్లిదండ్రులుపడే అవస్థలు ఈ నాటిక ఇతివృత్తం. దీనిని 1979లో ప్రదర్శించాము. దీనికి ప్రఖ్యాత రంగస్ధల, సినీ నటులు, దర్శకులు స్వర్గీయ శ్రీ కె.వి. శాస్త్రి గారు, మరియు శ్రీ బజరప్ప గారు దర్శకత్వం వహించారు. ఈ నాటిక చూసిన ప్రఖ్యాత సినీ నటుడు శ్రీ మురళీ మోహన్ గారు ఆ నాటికని చాలా ప్రశంసించారు.

“డాక్టర్.. డాక్టర్” పురుష పాత్ర లేని హాస్య నాటిక. ఇది సం. 2000 లో వ్రాసిన నాటిక. స్వర్గీయ శ్రీ కె.వి. శాస్త్రిగారు దర్శకత్వం వహించారు. 2000-01లో ఎ.జీ. ఆఫీసులో మహిళా ఉద్యోగినులచే ప్రదర్శించబడి బహుధా ప్రశంశలు అందుకుంది. తర్వాత దీనిలో కొంత భాగం దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌లో పలుమార్లు ప్రసారం చెయ్యబడింది. ఈ నాటిక రచనా సమయంలో వార పత్రికలు ఎక్కువగా చదివేవారు, అలాగే ప్రింటులో తమ పేరు చూసుకోవాలనుకునేవారుకూడా ఎక్కువే. పత్రికల్లో తమ పేరు ఏదో విధంగా పడాలని, పత్రికలను, అందులో రచనలనూ పొగుడుతూ ఉత్తరాలు రాసే ఉత్తరాల రచయితలు కూడా ఎక్కువగానే వుండేవాళ్ళు. వాళ్ళ పేరుతో పాఠకుల పేజీలో ఉత్తరం పడితే, ఒక నవల ప్రచురించబడ్డంత సంతోషపడిన ఉత్తరాల రచయితలు ఆ కాలంలో చాలామందే వున్నారు. వారితో అల్లిన సరదాల సుమమాలే ఈ “డాక్టర్…డాక్టర్…”.

ఈ హాస్య నాటికలు వ్రాసే సమయానికి ఈ తరహా హాస్యం అటు సినిమాలలోగానీ, ఇటు రంగస్ధలంమీదగానీ అంత ప్రచారం కాలేదు. వీటిలో గజలక్ష్మీ కళ్యాణాన్ని 2013లో, డాక్టర్... డాక్టర్ మార్చి 2014లో, ప్రగతి మహిళామండలి, లోతుగుంట, సికిందరాబాదు వారు ప్రదర్శించారు. వారికి నా కృతజ్ఞతలు. వారికోసం మళ్ళీ బయటకి తీసిన ఈ నాటికలు అవసరమైన వారికి ఉపయోగపడతాయని స్వల్పమార్పులతో కినిగెవారి ద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నాను.

- పి. యస్. యమ్. లక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Rendu Hasya Natikalu