-
-
రంగుటద్దాల కిటికీ
Rangutaddaala kitikee
Author: S Narayanaswami
Pages: 191Language: Telugu
అమెరికాలో స్థిరపడిన ఒక తెలుగు మనిషి, ఇటు విడిచి వచ్చిన గతాన్నీ, అటు చుట్టూ ఆవరించి ఉన్న ప్రస్తుతాన్ని రంగు రంగుల అద్దాల్లోంచి పాఠకుల ముందు ఆవిష్కరిస్తున్న కథా చిత్ర మాలిక రంగుటద్దాల కిటికీ. గతాన్ని తల్చుకునేప్పుడు నాస్టాల్జియా కానీ, ప్రస్తుతాన్ని చిత్రించేప్పుడు పేరనోయియాకాని మనకి కనిపించవు. ఏ కథలోనైనా కనిపించేది జీవితమే. సజీవమైన పాత్రలే. ఉద్యోగం నించి రిటైరైన తండ్రి దగ్గుకుంటూ, బుజాల మీద శాలువా సవరించుకుంటూ దీనంగా కాక, జీవితంలోని ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించేందుకు రెక్కలు చాచుతూ కనిపిస్తాడు. మరో కథలో కథానాయకుడి తల్లి, కొడుకు నిస్పృహతో కుంగిపోతుంటే తాను నిస్సహాయంగా కుమిలిపోదు, అతన్ని లేపి నిలబెట్టి కర్తవ్య దిశానిర్దేశం చేస్తుంది.
అమెరికా అవడానికి లేండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అయితే అవచ్చు కాని, అమెరికాలో జీవితం పూలబాట కాదు. అలాగని భరించలేనిదీ కాదు. సాధారణంగా అమెరికాకి సంబంధించిన తెలుగు కథల్లో కనబడే ఆహార భాషా వ్యవహార భేదాల చర్చని అధిగమించి, వలసవచ్చిన తెలుగు మనుషులు ఈ అమెరికా సమాజంలో అంతర్భాగమయ్యే ప్రయత్నంలోని అనుభవాలని కొంచెం లోతుగా, మరికొంచెం విశాలంగా పరిశీలిస్తూ - కొన్ని సరదా కథలు, కొన్ని ఆలోచింపచేసే కథలు, మరి కొన్ని సులభంగా మరిచిపోలేని కథలు, చక్కని భాష, కథకి తగిన కథన శిల్ప వైవిధ్యం - అన్నీ కలిసి రంగుటద్దాల కిటికీ.
The book is OK and not something that one should spend 30 bucks on this.