• Rangula Gadi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రంగుల గది

    Rangula Gadi

    Pages: 179
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ రచయిత కాశీభట్ల వేణుగోపాల కథల సంపుటి "రంగుల గది".

ఈ పుస్తకంలోని కథలు:
1. రంగుల గది (పెద్ద కథ)
2. బొమ్మజెముళ్ళు
3. ఒక స్వప్నం కోసం
4. ఒక వికృతి లోంచి
5. సహజాతాలూ - సరిహద్దులూ
6. కావేరి
7. విడుదల-శిక్ష
8. గుర్రపు డెక్క
9. దిగంత గానం
10. చావూ పుట్టుకల మధ్య
11. మనసు వినని మాట
12. శిక్ష
13. రాళ్ళెత్తిన కూలీ
14. అస్పష్ట చిత్రం
15. మా'రణ'రుణం

* * *

నాటకాల వాళ్ళంటే నీతి, నియమాలూ తప్పినవాళ్ళు, ప్రపంచంలో వున్న అన్ని వ్యసనాలు వాళ్లకుంటాయి, ముఖ్యంగా ఆడవాళ్ళు రంగు పులుముకుని రంగమెక్కారంటే వాళ్ళు కళనే కాదు, ఒళ్ళును కూడా అమ్ముకుంటారన్న ఓ వికృత భావన నాగరిక సభ్యలోకమంతా అల్లుకుపోయింది.

ఆ వికృత భావనని మోసీ, మోసీ, ఆ సభ్యనాగరికలు చూసే అసభ్య ఏహ్యపు చూపులు భరించీ భరించీ మావాళ్ళు కూడా రాటుదేలి, కసిగా ఇంకా ఇంకా బీభత్సంగా ప్రవర్తిస్తారు.

ఓసారి రాజమహేంద్రవరంలో ఈ జముననే హోటల్ గదిలో ఎవడో వచ్చి రమ్మని పిలిచాడు. అలవోకగా వాణ్ణి చూసి, "అయిదు వేలు తీసుకురా" అంది.

వాడో బూతుమాట పేలి, "అంత రేటా" అన్నాడు

"నా రేటంతే. నువ్వు భరించలేవుగానీ, మా డైరక్టరు మాంచి ఊపుమీదున్నాడు. నేనే ఓ రెండువేలిస్తా. నీ భార్యని పిల్చుకురా" అంది

వచ్చినవాడు ఆవేశం పట్టలేక నానా బీభత్సం సృష్టించాడా రోజున.

అంతే ఈ కళాకారులకీ, కళాకారులు కాని ప్రజానీకానికీ మధ్య ఓ గోడ వుంది. ఉంటుంది. వాళ్ళూ, వీళ్ళూ ఏకం కాలేరు. కాలేరంతే.

- (రంగుల గది కథ నుంచి)

Preview download free pdf of this Telugu book is available at Rangula Gadi