• Rangabhumi
  • Ebook Hide Help
    ₹ 540
    600
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రంగభూమి

    Rangabhumi

    Author:

    Pages: 663
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1880 - 1936ల మధ్య జీవించి, 13 నవలలు, 400 కథానికలు రచించిన ప్రేమ్‌చంద్, హిందీ సాహిత్యాన్ని ప్రణయలీలా విలాసాల నుండి వాస్తవిక ధోరణికి, సంస్కారాత్మక ప్రయోజనానికి మళ్ళించిన అభ్యుదయ సాహితీ ఉద్యమ ప్రవక్త.
కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి.
భూస్వామ్య వ్యవస్థ కూలిపోతూ పారిశ్రామిక నాగరికత తోసుకు వస్తున్న సమయంలో, పాత వ్యవస్థలోని కొంత ముంచి కూడా ఎలా నశించిపోతుందో చిత్రించే నవల రంగభూమి.
గుడ్డివాడు, బిచ్చగాడు ఐన సూరదాసు భూమిని మోసం ద్వారా జాన్‌సేవక్ అనే పారిశ్రామికాధిపతి కొని, సిగరెట్ ఫ్యాక్టరీ స్థాపించడం, గ్రమ జీవితంలోని ప్రశాంతత ధ్వంసమై, కృత్రిమత్వం, కుటిలత్వం చోటుచేసుకోవటం ఇందులోని కథా వస్తువు. ఈ క్రమంలో సూరదాసు తుపాకి గుండ్లకు బలై చనిపోతాడు. గాంధీజీ సిద్ధాంతాలతో సంపూర్ణ విశ్వాసం గల ప్రేమ్‌చంద్ జీవితాంతం త్యాగమయ జీవితం గడిపాడు. సోషలిస్టు ప్రపంచం గోర్కీ సాహిత్యంతో ఆకర్షితుడై, 1936లో ప్రథమ అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించి ఆ ఉద్యమానికి మూల పురుషుడైనాడు.
ప్రేమ్‌చంద్ ఉత్తమ రచనలలో ఒకటి రంగభూమి.

Preview download free pdf of this Telugu book is available at Rangabhumi