• Ranga Ratnalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రంగ రత్నాలు

    Ranga Ratnalu

    Publisher: Natali Prachuranalu

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ద్వితీయ ప్రపంచ యుధ్ధానంతరం ఔత్సాహిక నాటక రంగానికి ఆశయనిర్ధేశం, మార్గనిద్ధేశం చేసిన ఆదర్శమూర్తుల గ్రంధం ఇది. పామర రంజకమైన పాత పద్యనాటకాలు ఇంకా పల్లెల్లో ప్రజాదరణ పొందుతూ కాంట్రాక్టర్ల సంచులు నింపుతూ ఉన్నా, ఔత్సాహిక సాంఘిక నాటకాలు అటు పరిషత్‌ పోటీలను, మహానగరాలకూ పరిమితం అయిపోయినా ఈ తరం ఆదర్శమూర్తుల ప్రభావం వల్ల నాటక రంగానికి గౌరవ భాజనత ఏర్పడింది- సంఘంలో నటులకూ, నాటక కళకూ ఉన్న కళంకం క్రమంగా తగ్గసాగింది- ఈ ఆదర్శమూర్తులు ఆంధ్ర నాటక రంగాన్ని ప్రజల మధ్యకు ఎంతగా తీసుకు వెళ్లారంటే ఇప్పుడు ఆంధ్రదేశంలో నటుడుగాని, నాటక కర్తగాని కానివాడు లేడు అనవచ్చును - సినీమా రంగం, బుల్లి తెర విజృంభణం వల్ల నటీ నటులకూ, ప్రయోక్తలకూ కొదువలేదు - విశ్వవిద్యాలయాల, నట శిక్షణ కేంద్రాలలో నాటకం, టీ.వీ. బోధనాంశాలుగా మారి డిప్లమాలూ డిగ్రీలూ ప్రదానం చేస్తున్నది.

అట్టి స్థాయిని నాటక రంగానికి చేకూర్చిన ఆదర్శమూర్తుల జీవిత రేఖలను ''ఆదర్శమూర్తుల'' పేరిట గ్రంధాలుగా రచించారు. ఆ క్రమంలో ఇది మూడవది- ఈపుస్తకాల విషయంలో తనదైన ఒక విలక్షణమైన ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నారు. చారిత్రక ప్రాధాన్యం లేకుండా రచయితలు, ప్రయోక్తలు, నటులు వారి వారి ఆదర్శాల ప్రాభవ వైభవాలను బట్టి రచన సాగించారు. ఈ ఆదర్శమూర్తులు సంపుటాల్లో ఆయన కొందరు రచయితలనూ, ప్రయోక్తలనూ, నటులనూ మనకు పరిచయంచేశారు. వారి గురించి ఆయన చేసిన విషయసేకరణలో కొన్నిఅపూర్వ విషయాలున్నాయి. నాటక శాస్త్ర విద్యార్ధులకే కాకుండా పరులను కూడా సంతోష పెట్టే విషయాలివి.

- 'కళా ప్రపూర్ణ' డా॥ గణపతిరాజు అచ్యుతరామరాజు

Preview download free pdf of this Telugu book is available at Ranga Ratnalu