• Randi Rajakeeyalloki Yuvataku JP Pilupu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రండి .. రాజకీయాల్లోకి - యువతకు జేపీ పిలుపు

    Randi Rajakeeyalloki Yuvataku JP Pilupu

    Author:

    Pages: 83
    Language: Telugu
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 9 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

'రండి .. రాజకీయాల్లోకి - యువతకు జేపీ పిలుపు' పేరుతో సీనియర్‌ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త సురేశ్‌ వెలుగూరి రచించిన ఈ పుస్తకం లోక్‌సత్తా అంతరంగాన్ని నిర్వచిస్తుంది. లోక్‌సత్తా సారథి డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ జాతిని ముందుకు నడిపించుకోవడం బాధ్యతగా తీసుకుని యువతీయువకులు ఎలా ముందడుగు వేయాలో ఇవ్వాళ్టి యువతరానికి సూచిస్తున్నారు ఈ పుస్తకం ద్వారా.

ఈ పుస్తకానికి డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ రాసిన ముందుమాటలోని కొన్ని వాక్యాలను చదివితే ఆయన యువతరం నుంచి ఏం ఆశిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.

''గాంధీగారి లాగానో, వావిలాల గోపాల కృష్ణయ్య గారి లాగానో జీవితాల్ని త్యాగం చేయనక్కర్లేదు. ఆడుతూపాడుతూనే మీ పరిధిలో మీరు స్పష్టతతో బాధ్యత తీసుకుని, మీ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు సిద్ధపడితే చాలు. మన లక్ష్యాల్ని సాధించుకునేందుకు, అవసరమైతే అందుకు కావలసిన మార్పుల్ని చేసుకునేందుకు కూడా రాజ్యాంగంలో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. దేశజనాభాలో 70 శాతానికి పైగా ఉన్న యువత, అంటే మీరు, మీకు తోడుగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు భారతదేశానికి ఆశాకిరణాలు. వార్డు స్థాయిలో ఏం చేయాలి, జిల్లా స్థాయిలో ఏంచేయాలి, ఎమ్మెల్యే ఏంచేయాలి, ఎంపీ ఏం చేయాలి, అసెంబ్లీ, పార్లమెంటులలో చేయాల్సిన పనులేమిటి? వగైరాలు కనీసస్థాయిలో తెలుసుకోవాలి. ఓటును పెట్టుబడిగా భావించాలి. ఎలాగైతే మీరు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికీ లాభాలు ఆశిస్తారో, అలాగే రాజకీయ పార్టీల నుంచి ఏమి డిమాండ్‌ చేయాలో, మీరు వేసే ఓటు ద్వారా మీకు వచ్చే లాభం ఏ పార్టీద్వారా ఎంత ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేసుకుని తర్వాతే ఓటు వేయాలి. మిమ్మల్ని ఆ దిశగా మరింత చైతన్యపరిచేందుకే సురేశ్‌ వెలుగూరి ఈ పుస్తకాన్ని అందిస్తున్నారు''

ప్రతి యువతీ యువకుడూ తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది.

Preview download free pdf of this Telugu book is available at Randi Rajakeeyalloki Yuvataku JP Pilupu
Comment(s) ...

This is not continuous book, but a compilation of variou articles or quotes given by JP.