• Ramayana Vishavruksha Visham
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రామాయణ విషవృక్ష విషం

    Ramayana Vishavruksha Visham

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 144
    Language: Telugu
    Rating
    4.20 Star Rating: Recommended
    4.20 Star Rating: Recommended
    4.20 Star Rating: Recommended
    4.20 Star Rating: Recommended
    4.20 Star Rating: Recommended
    '4.20/5' From 5 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

విజ్ఞానాన్ని విపరీతానికి వాడుకుంటే అది విజ్ఞానమవుతుందా? అలా చేస్తే మనకు విజ్ఞానం ఉన్నట్టా? సమాజం - 'అది ఏ సమాజమైనా దాని మంచి చెడులు దానికుంటాయి. ఆయా సమాజాల్లో ఎంతెంత చెడు ఉంది?' అని తెలుసుకొని మంచిని ప్రోత్సహిస్తే అది భవిష్యత్‌ సమాజానికి చక్కటి బాట అవుతుంది. అలా కాకుండా మన సమాజంలో 'చెడు ఉంది... ఉంది... ఉంది...' అంటూ అక్కడక్కడే తిరుగాడుతూంటే కలిగే ప్రయోజనం ఏమి? 'రామాయణ విషవృక్షాన్ని' కుళ్ళబొడచనికి కాదు 'రామాయణ విషవృక్ష విషం' రాసింది. 'రామాయణ విషవృక్షం' ఏం చెప్పింది? అని తేల్చి చెప్పే పనిని మాత్రమే 'రామాయణవిషవృక్షం విషం' చేస్తుంది.

ఆలోచనా దృక్పథం పేరిట మనోవిజ్ఞాన శాస్త్ర విశ్లేషణ పేరిట, మన పూర్వకావ్యాలపై ఆక్రోశం వెళ్ళగక్కుతున్నామంటే 'మన మనస్తత్వాలకు దిగజారి ప్రవర్తించే జబ్బు ఉందేమో?'' అని ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. వికృత మనస్తత్వాల వైపు ఎంత ఇష్టంగా వెళుతున్నామో? గమనించవచ్చు. నెయ్యి కమ్మగా ఉందని ఒంటికి రాసుకోం! తేనె తియ్యగా ఉందని తలకు అంటించుకోం! ఈ విధంగానే విజ్ఞానమైనా, విశ్లేషణైనా ఒక పద్ధతిగా సాగకపోతే కలిగే విపరీత ధోరణులు సమాజానికి ఎంత కీడును తెస్తాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రాచీన కావ్యమైనా, ఆర్వాచీన రచనైనా, అవి సమాజంలో అంతర్భాగాలే. సమాజ 'పరిధులు' దాటి అవి ప్రవర్తించ కూడదు.

మనం, మన తర్వాత లక్ష సంవత్సరాల ముందుకైనా సమాజం అంటే మనుషుల సమూహమే. అక్కడున్నదీ మానవ సంబంధాలే. అప్పుడు కూడ అక్కడ మంచి చెడులుంటాయి. మంచిని మంచిగా, చెడుని చెడుగా వేరు చేసి మన ముందు సమాజానికి మనం అందివ్వాలి. అప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఉండేందుకు వీలుంది.

మూఢ విశ్వాసాలు రామాయణం లేని రష్యాలోనూ, చైనాలోనూ మరే దేశంలోనైనా ఉన్నాయి. ఏ సమాజం కూడా మూఢవిశ్వాసాలను ఒంట పట్టించుకోమని చెప్పదు. ఇప్పుడున్న మూఢ విశ్వాసాలు 'కేవలం పురాణాల వల్ల వచ్చినవే' అనుకుంటే ఎలా? మూఢ విశ్వాసాలు అనేవి సమాజంలో మానవుల అవకాశవాదం వల్ల నిరంతరాయంగా నిలదొక్కుకున్నాయి. చదువుకున్న వాళ్ళూ మూఢ విశ్వాసాలకు అతీతులేం కాదు. ప్రతి మనిషి కొంతలో కొంతైనా ఆలోచించుకోవడానికి సమయం కేటాయించినప్పుడే ఈ దుష్పరిణామాలను తెలుసుకోగలడు.

ఆలోచనాధోరణి పేరిట వితండవాదాన్ని సృష్టించడమే అత్యాధునిక నాగరికతగా మనలో కొంతమంది భావిస్తున్నారు. ఈ వితండవాదాన్ని భవిష్యత్తుకు అందిస్తే మనదిఆలోచనా ధోరణి అవుతుందా?

''రామాయణ విషవృక్షం'' లోని ''విషం'' వెలికితీయడం''ఒక సామాజిక అవసరం'' అని భావించినందువల్లనే ఈ రచన పుట్టింది. ఏ రచయిత అయినా ఈ విధంగా ఒక కారణాన్ని చెప్పడం పరిపాటి. ''కాకిపిల్ల కాకికి ముద్దు'' అనే ధోరణి కావచ్చు. ఇది కాకిపిల్లా? కోయిల పిల్లా? అని తేల్చాల్సింది సమాజమే. నేను తెలుసుకున్నది నేను రాసినప్పుడు సమాజం చెప్పాల్సింది కూడ సమాజం చెబుతుంది. సమాజ తీర్పుకు కట్టుబడి ఉండం ఒక ''విజ్ఞత'' అందుకు నేను సిద్ధమే. ఇందులోని దోషాలను వెలికితీసే కర్తవ్యాన్ని ఎవరు భుజాన వేసుకున్నా సంతోషమే.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Ramayana Vishavruksha Visham